Clinical training: క్లినికల్ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి
Sakshi Education
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్‌లో ఎంఎల్‌టీ కోర్సు 2019 మార్చి తర్వాత ఉత్తీర్ణులైన వారు ఏడాది పాటు క్లినికల్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె.రవిబాబు సూచించారు.
జిల్లాలోని ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణకు ఎంపికై న వారు రూ.వెయ్యి డీడీ చెల్లించాల్సి ఉంటుందని, గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
చదవండి: Teddy Bear Clinic: పిల్లల్లో భయం పోగొట్టే క్లినిక్‌లు ఇప్పుడు స్కూళ్లలో..
బయోడేటా ఫారం, సర్టిఫికెట్ల జిరాక్స్‌తో పాటు రూ.10 పోస్టల్ స్టాంప్ అతికించిన సొంత చిరునామా గల కవర్‌ను ఫిబ్రవరి 26 సాయంత్రం ఐదు గంటల్లోగా తమ కార్యాలయంలో అందజేయాలని డీఐఈఓ సూచించారు.
Published date : 16 Feb 2024 01:30PM