Skip to main content

Vocational Courses: 42 స్కూళ్లలో ఒకేషనల్‌ కోర్సులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 42 జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 9వ తరగతి విద్యార్థులకు వివిధ రకాల ఒకేషనల్‌ కోర్సులు అందించనున్నారు.
Vocational Courses
42 స్కూళ్లలో ఒకేషనల్‌ కోర్సులు

ఇందుకు సంబంధించి సమగ్రశిక్షణ విభాగం ఉత్తర్వులు జారీచేసింది. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఒకేషనల్‌ ట్రైనింగ్‌ పార్టనర్‌(వీటీపీలు) ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. 2023లో 9వ తరగతి వరకు అమలు చేసి, వచ్చే విద్యాసంవత్సరంలో పదో తరగతికి కూడా అందిస్తామని సమగ్రశిక్షణ డైరెక్టర్‌ రమేశ్‌ తెలిపారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

ఒకేషనల్‌ విద్య ను ప్రోత్సహించడమే దీని ఉద్దేశమన్నారు. తరగతి సిలబస్‌తోపాటు దీన్ని ఐచ్ఛికంగా నేర్చుకోవచ్చని వివరించారు. ఎల్రక్టానిక్స్, దుస్తులు, ఇంటి ఫర్నీషింగ్, డొమెస్టిక్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్, కుట్టుమిషన్‌ ఆపరేషన్, డైరీవర్క్, అసిస్టెంట్‌ బ్యూటీ థెరపిస్ట్, అసిస్టెంట్‌ ప్లంబర్, ఆటో సర్విస్‌ టెక్నీషియన్‌ వంటి పలు రకాల ఒకేషనల్‌ కోర్సులు ఇందులో ఉన్నాయి.

Published date : 10 Dec 2022 01:36PM

Photo Stories