Tenth Class: ఈ తేదీ లోగా టెన్త్ ప్రీ ఫైనల్స్ నిర్వహించాలి.. సిలబస్ మాత్రం ఇలా..
ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలాఖరుకు సిలబస్ పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులకు స్పష్టం చేశారు. దీనికోసం అవసరమైతే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. సిలబస్ పూర్తవ్వని స్కూళ్ల జాబితాను పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఇటీవల పరిశీలించింది.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
వాస్తవానికి గతేడాది డిసెంబర్ 31 నాటికే సిలబస్ పూర్తి కావాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, పదోన్నతులు, బదిలీల హడావుడి, వరుస సెలవుల కారణంగా 18 శాతం స్కూళ్లలో సిలబస్ పూర్తి కాలేదని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో మిగిలిన సిలబస్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేసి ఫిబ్రవరి నుంచి రివిజన్‌కు వెళ్లాలని అధికారులు హెచ్‌ఎంలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 5.07 లక్షల మంది టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 15 వేల మంది ఈ సంవత్సరం పెరిగారని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రైవేటు స్కూళ్లతో పోలిస్తే గతేడాది టెన్త్‌లో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు (72.39 శాతం), స్థానిక సంస్థల పాఠశాలల్లో (79.14 శాతం) ఉత్తీర్ణత తక్కువగా నమోదైన నేపథ్యంలో ఈసారి ఆయా స్కూళ్లు వంద శాతం ఫలితాలు సాధించే దిశగా అడుగులేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం హెచ్‌ఎంలకు సూచించింది.