తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల విద్యాలయాల్లో 2024–25 విద్యాసంవత్సరానికి 6,7,8,9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లు భర్తీ చేయడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆదిలాబాద్ రీజినల్ కో ఆర్డినేటర్ కొప్పుల స్వరూపారాణి ఓ ప్రకటనలో తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అల్గునూర్ (కరీంనగర్), గౌలిదొడ్డి (రంగారెడ్డిలోని పాఠశాలల్లో తొమ్మిదో తరగతిలో రెగ్యులర్ అడ్మిషన్ల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పరిగి వికారాబాద్‌జిల్లాలో బాలికలు, ఖమ్మం బాలికల విద్యాలయాల్లో 8వ తరగతిలో రెగ్యులర్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సీట్ల ఖాళీల వివరాలకు www. tswreis. ac. in ను సంప్రదించి ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Tags
- Telangana Social Welfare Gurukula Vidyalayas Admission 2024
- Telangana Social Welfare Gurukula Vidyalayas News
- Telangana Social Welfare Gurukula Vidyalayas
- TS Tenth Class Exam 2024
- sakshieducation latest news
- Welfare Gurukula Vidyalayas Admission News
- Telangana Social Welfare Gurukula Vidyalayas Corporation
- Academic year 2024-25
- Vacancies
- online applications
- Gurukula Vidyalayas
- Vacancy Details
- Social Welfare Department