Skip to main content

Admission in 5th class: తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు..

Telangana gurukulam 5th class admission
Gurukula Vidyalayas Class 5 Admissions: Apply Today  Principal Madhavilatha Announces Entrance Test for Class 5  Telangana gurukulam 5th class admission   Social Welfare Gurukula College Principal Madhavilatha's Statement
Telangana gurukulam 5th class admission

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల విద్యాలయాల్లో 2024–25వ విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష కోసం విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ మాధవిలత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Also Read:  Admission in 5th class: తెలంగాణ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు.. ప్రవేశ పరీక్ష ఇలా‌..

విద్యార్థులు 2023–24 విద్యాసంవత్సరం ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి చదువుతూ ఉండాలని తెలిపారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థుల తల్లిదండ్రులు www. tswreis. telangana. in వెబ్‌సైట్‌ ద్వారా ప్రవేశ పరీక్ష కోసం జనవరి 6వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Published date : 29 Dec 2023 03:25PM

Photo Stories