Department of Education: విద్యార్థులకు నైపుణ్య పరీక్షలు
Sakshi Education
రామగుండం: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల నైపుణ్య సామర్‌ాధ్యలు గుర్తించేందుకు విద్యాశాఖ నవంబర్ 3న ప్రత్యేక పరిశీలకుల సమక్షంలో స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్‌మెంట్ సర్వే (ఎస్‌ఈఏఎస్) పరీక్షలు నిర్వహించింది.
ఇందులో భాగంగా అంతర్గాం, రామగుండం మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మూడు, ఆరు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు గుణాత్మక విద్య, నైపుణ్యాలు, విద్యార్థుల సామర్ధ్యం తదితర అంశాలపై పరీక్షలు నిర్వహించారు. ఇందులో విద్యార్థుల సామర్ధ్యంతోపాటు ఉపాధ్యాయుల పనితీరుపై కూడా స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
చదవండి: Sankranti Ravikumar: అమెరికాలో శిక్షణకు లాలాపురం ఉపాధ్యాయుడు
ఈ ఫలితాలతో విద్యార్థులస్థాయి సామర్ధ్యం, గుణాత్మక విద్యాబోధన తదితర అంశాలపై స్పష్టత రావడంతోపాటు ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపరచాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. వీటన్నింటితోపాటు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల గ్రేడింగ్ గుర్తించే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాంప్లెక్స్ ఉపాధ్యాయుడు ఏకాంబరం, హెచ్‌ఎం రాచర్ల శ్రీనివాస్, దశరథం తదితరులు పరీక్షలు పర్యవేక్షించారు.
Published date : 04 Nov 2023 03:11PM