Green Solar Energy: ప్రభుత్వ పాఠశాలలో రూప్‌టాప్ సోలార్ ఎనర్జీ
ఏప్రిల్ 4న ఆమె గోల్కొండ రేతిగల్లీలోని సెకండ్ లాన్సర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని 65 ప్రభుత్వ పాఠశాలలు, ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గ్రీన్ సోలార్ ఎనర్జీ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీని వల్ల విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన పెంపొందించడమే కాకుండా కర్బన ఉద్గారాల వినియోగం వల్ల జరిగే అనర్థాలను నివారించవచ్చునన్నారు.
హెచ్‌ఎస్‌బీసీ సహకారంతో ఈ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాజీద్ హాష్మీ మాట్లాడుతూ యూనైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్, హెచ్‌ఎస్‌బీసీ సోలార్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్‌కు తమ పాఠశాలను ఎంచుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తమ పాఠశాలలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేశారని, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థుల సహకారంతో అన్నీ విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో గ్లోబల్ సర్వీస్ సెంటర్స్, హెచ్‌ఎస్‌బీసీ మమత మాదిరెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.