Admissions: గురుకులాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి నోటిఫికేన్ విడుదల
5, 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు.
భర్తీ చేయనున్న సీట్లు ఇలా..
5వ తరగతిలో ఒక్కో స్కూల్‌లో 80 సీట్ల చొప్పున భర్తీ చేయనున్నారు. ఇంటర్ ఒక్కో దాంట్లో 80 చొప్పున 180 సీట్లు భర్తీ చేయనున్నారు. ముస్లిం, క్రిస్టియన్, పార్శీ, జైన్, సిక్కులతో పాటు మైనా ర్టీయేతర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మైనార్టీలకు మొదట వచ్చిన వారికి మొదటి సీటు ప్రాతిపదికన, మిగతా వారికి లక్కీ డ్రా ద్వారా సీట్లు కేటాయించనున్నారు.
6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇంటర్‌తోపాటు ఐఐటీ/జేఈఈ, నీట్, ఎంసెట్, తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. కాలేజీల్లో ఇంటర్ మొదటి ఏడాదికి ఆన్‌న్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. 10 తరగతిలో వచ్చిన జీపీఏ పాయింట్ల ఆధారంగా కాలేజీల్లో సీట్లు ఇస్తారు. ఆసక్తి ఉన్న వారు htt p://tmreir.telangana.gov.in లేదా మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ నంబర్లను సంప్రదించవచ్చు
భువనగిరి (బాలుర) 73311 70858
చౌటుప్పల్ (బాలుర) 79950 57989
ఆలేరు (బాలికలు) 99505 7988
వివరాలు..
5వ తరగతిలో రెగ్యులర్ అడ్మిషన్లతో పాటు 6,7,8 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్లు భర్తీ చేయనున్నారు.
అర్హతలు: 5వ తరగతిలో ప్రవేశాలకు 2012 సెప్టెంబర్ 1 –2015 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి
- 6వ తరగతిలో 2011 సెప్టెంబర్ 1–2014 ఆగస్టు 31 మధ్య
- 7వ తరగతిలో 2010 సెప్టెంబర్ 1–2013 ఆగస్టు 31 మధ్య
- 8వ తరగతిలో 2009 సెప్టెంబర్ 1–2012 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.
కళాశాలల్లో(జనరల్, ఒకేషనల్)
అర్హత: ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు కోరువారు టెన్త్ ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కనీసం 6 జీపీఏ ఉండాలి.
వయో పరిమితి: 2024 ఆగస్టు 31 నాటికి 18 సంవత్సరాలకు మించి ఉండరాదు.
వార్షిక ఆదాయం: గ్రామీణ అభ్యర్థులకు రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదు. దివ్యాంగులకు, ఎక్స్–సర్వీస్‌మెన్ పిల్లలకు ఎలాంటి పరిమితి లేదు.