Skip to main content

10th & Inter Exams: పకడ్బందీగా ‘ఓపెన్‌’ పరీక్షలు

సంగారెడ్డి టౌన్‌: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సూచించారు.
open tenth and inter exams

ఏప్రిల్ 15న‌ కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏప్రిల్ 25 నుంచి మే 2వ తేదీ వరకు థియరీ పరీక్షలు, 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

టెన్త్‌ పరీక్షలకు 2388 మంది విద్యార్థులు, ఇంటర్‌కు 4297 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా సెంటర్ల వద్ద సరైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

పరీక్షలు ప్రతీ రోజు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు.. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఐదు గంటల వరకు జరగనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పద్మజారాణి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్

Published date : 16 Apr 2024 02:57PM

Photo Stories