Department of Education: విద్యార్థుల అభ్యసన పరిశీలన
Sakshi Education
సిరిసిల్లఎడ్యుకేషన్: సిరిసిల్ల పట్టణంలోని గోపాల్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ సందర్శించారు.
విద్యార్థులు చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలలో నిష్ణాతులను చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పరీక్షించారు. మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించారు.
చదవండి: ABK Prasad: ఇంకా ఎందుకీ విదేశీ మొగ్గు?
అల్పాహారం పెట్టినందుకు ఒక్కో విద్యార్థికి రూ.10.50 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అల్పాహారం వండి పెట్టినందుకు వంటకార్మికులకు అదనంగా రూ.2వేలు ప్రభుత్వం ఇస్తుందని వివరించారు. టీచర్లు అజయ్‌కుమార్, శివకుమార్, ప్రియాంక, మమత, భవాని పాల్గొన్నారు.
Published date : 08 Dec 2023 04:31PM