DEO Vijayendra Rao: ఇద్దరు సస్పెన్షన్, 23 మంది టీచర్లకు నోటీసులు
Sakshi Education
చిత్తూరు కలెక్టరేట్ : విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఒక ఎంఈవో, ఒక హెచ్‌ఎంను సస్పెండ్ చేస్తూ, 23 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు డీఈవో విజయేంద్రరావు వెల్లడించారు.
నవంబర్ 3న ఆయన విలేకరులతో మా ట్లాడుతూ ఇటీవల జిల్లా పర్యటనకు విచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ గంగవరం మండలంలో పర్యటించినప్పుడు అనేక లోపాలు గుర్తించారన్నారు. కీలపట్ల ఎంపీపీఎస్ హెచ్‌ఎం పీఎం దామోదరంను, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయని కారణంగా ఎంఈవో–1 వేణుగోపాల్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తు న్న ఎస్జీటీలు తేజోవతి, తులసీనాథం నాయుడు, భాస్కరయ్యకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
చదవండి:
Published date : 04 Nov 2023 03:14PM