Department of Education: యూడైస్‌లో పేర్లు నమోదు చేయాలి
Sakshi Education
భూపాలపల్లి అర్బన్: ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం (యూడైస్)లో ప్రతి విద్యార్థి పేరు నమోదై ఉండాలని జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాంకుమార్ అక్టోబర్ 17న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అక్టోబర్ 28వ తేదీలోపు యూడైస్‌లో విద్యార్థుల పేర్లను నమోదు చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల వివరాలు ఉంటేనే పరీక్షలకు అనుమతి ఇస్తారని చెప్పారు. 10 పరీక్షలకు ఫీజు చెల్లించిన తర్వాత ఆయా పాఠశాలలు ప్రభుత్వ పరీక్షల విభాగానికి విద్యార్థుల పేర్లు సమగ్ర వివరాలతో కూడిన నామినల్ రోల్స్‌ను పంపాల్సి ఉంటుందన్నారు.
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ప్రభుత్వ, ప్రైవేట్ సొసైటీలు విద్యార్థులను యూడైస్‌లో నమోదు చేయాలని తెలిపారు.
చదవండి:
Special Syllabus: విద్యాసంస్థల్లో పర్యావరణంపై ప్రత్యేక సిలబస్
Medical Health Department: ఈ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్
Published date : 18 Oct 2023 04:17PM