6th Class Admissions: ఈ స్కూళ్లు విద్యార్థులకు వరం.. ఒక్కో పాఠశాలలో 100 సీట్లు..
కాగా మోడల్ స్కూళ్లలో 2024–25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడింది. జనవరి 12నుంచి దఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఫిబ్రవరి 22వ తేదీ చివరి గడువు.
ఏప్రిల్ 7న ఉదయం 10నుంచి 12గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 7,8,9,10 తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీకి ప్రవేశ పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగనుంది. పరీక్ష ఫీజు ఎస్సీ,ఎస్టీ,బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125,జనరల్ విద్యార్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
చదవండి: Key to Success: చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
ఒక్కో పాఠశాలలో 100 సీట్లు..
మానుకోట జిల్లాలో 8 ఆదర్శ పాఠశాలలు ఉన్నా యి. డోర్నకల్ మండలం చిలుకోడు, మరిపెడ, కురవి మండలం నేరడ, మహబూబూబాద్ మండలం అనంతారం, తొర్రూరు మండలం గుర్తూరు, కేసముద్రం మండలం కల్వల, నెల్లికుదురు, నర్సింహులపేటలో మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి 100 సీట్లు ఉంటాయి. 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను మాత్రమే భర్తీ చేయనున్నారు.
ఏప్రిల్ 1నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్..
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ 1నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష ఉంటుంది. మే 15న ఫలితాలు వెల్లడించి, సంబంధిత ప్రిన్సిపాళ్లకు మెరిట్ జాబితాను అందజేస్తారు. మే 24న ఎంపికై న విద్యార్థుల జాబితా ఖరారు చేసి అడిషనల్ కలెక్టర్ ఆమోదం పొందుతారు. మే 25 నుంచి 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 2024 జూన్ 1న తరగతులు ప్రారంభమవుతాయి.
చక్కటి అవకాశం..
ఆదర్శ పాఠశాలల్లో నా ణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్నం పూట భోజ నం అందిస్తున్నాం. క్రమశిక్షణ, మెరుగైన ఫలితాలతో ముందంజలో ఉన్న ఆదర్శ పాఠశాలల్లో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఈ చక్కటి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
- ఆరో తరగతిలో చేరేందుకు అవకాశం
- ఫిబ్రవరి 22న చివరి గడువు
- ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష
బాలికలకు హాస్టల్ సౌకర్యం..
ఆదర్శ పాఠశాలల్లో బాలికలకు మాత్రమే హాస్టల్ వసతి ఉంది. 9,10 తరగతులతో పాటు ఇంటర్ చదువుతున్న వంద మందికి మాత్రమే హాస్టల్ వసతి అవకాశం ఉంది. హాస్టల్‌కు కనీసం 3 కిలోమీటర్లు, ఆపై దూరంగా ఉండేవారు హాస్టల్‌లో ప్రవేశానికి అర్హులు.
పరీక్ష విధానం..
ప్రవేశ పరీక్షలో వంద మార్కులకు వంద ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ఆరో తరగతిలో తెలుగు, గణితం, ఎన్విరాన్‌మెంట్ సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో ఒక్కోదాని నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. 7 నుంచి 10వ తరగతులకు గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలు, ఇంగ్లిష్‌లో ఒక్కోదాని నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. రెండు గంటల పాటు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.