Pamela Satpathy: విద్య కోసమే ఇంటర్నెట్ వినియోగించాలి
Sakshi Education
కరీంనగర్/తిమ్మాపూర్: ఇంటర్‌నెట్ కారణంగా విద్యార్థులు పెడదోవ పడుతున్నారని, దాన్ని విద్య కోసమే ఉపయోగించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
స్నేహిత కార్యక్రమాన్ని తిమ్మాపూర్‌లోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్లో జనవరి 10న ఆమె ప్రారంభించారు. ఆడపిల్లలు ఏ సమస్య ఉన్నా ధైర్యంగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చెప్పాలన్నారు. ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా చదువు కొనసాగించాలని పేర్కొన్నారు.
చదవండి: Andhra Pradesh: నెట్టింట.. ప్రభుత్వ బడులు!
ఫొటోలను, ఫోన్ నంబర్లను ఎవరికీ పంపించవద్దన్నారు. సర్పంచ్ నీలిమ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, వైద్యాధికారి లలితాదేవి, కరీంనగర్ రూరల్ సీడీపీవో సబితాకుమారి, డీసీపీవో శాంత, తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈవో తదితరులు పాల్గొన్నారు.
Published date : 12 Jan 2024 11:18AM