Govt Schools: మందుబాబుల అడ్డాగా ప్రభుత్వ పాఠశాలలు
అలాంటి నిబంధనలున్న పరిస్థితుల్లో మద్యానికి ప్రభుత్వ విద్యాసంస్థలు అడ్డాగా మారడం విస్మయానికి గురిచేస్తోంది. పరకాల పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 8 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇవి మందు బాబులకు అడ్డాగా మారుతున్నాయి. ఆయా పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో రాత్రి అయిందంటే చాలు మందుబాబులు వాలిపోతున్నారు. విచ్చలవిడిగా మద్యం తాగి ఖాళీ సీసాలు, మిగిలిన తినుబండారాలను అక్కడే పడేసి వెళ్తున్నారు.
చదవండి: పాఠశాల విద్యార్ధులకు ఉచిత ప్రయాణం
రోజూ ఉదయం పాఠశాలకు చేరుకునే ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల ఆవరణలో పడి ఉండే మద్యం సీసాలు, తిని పడేసిన తినుబండార్యం ప్యాకెట్లను చూసి అవాక్కవుతున్నారు. పాఠశాలలకు ప్రహరీలు కట్టి గేటు పెట్టించాలని, రాత్రివేళల్లో ప్రభుత్వ పాఠశాలల మద్యం తాగేవారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.