Skip to main content

యూడైస్‌ ప్లస్‌లో విద్యార్థుల వివరాలు సవరించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: యూడైస్‌ ప్లస్‌లో విద్యార్థుల వివరాలు సవరించి డ్రాప్‌ బాక్స్‌ క్లియర్‌ చేయాలని డీఈవో ప్రణీత సూచించారు.
DEO Pranitha's Recommendation, The details of the students should be edited in UDISE Plus,Adilabad Town Education System
యూడైస్‌ ప్లస్‌లో విద్యార్థుల వివరాలు సవరించాలి

 అక్టోబ‌ర్ 26న‌ ఆదిలాబాద్‌ పట్టణంలోని ఎస్సార్‌ డిజీ, సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌, శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల, చావరా పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల వివరాల సవరణ ప్రక్రియను అక్టోబ‌ర్ 28వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఏవైన సందేహాలుంటే సంబంధిత ఎంఐఎస్‌, సీసీవోలను సంప్రదించాలని సూచించారు. ఆమె వెంట ఏఎస్‌సీ ఉస్మాన్‌, జిల్లా విద్యాశాఖ టెక్నికల్‌ పర్సన్‌ సలీం తదితరులున్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 27 Oct 2023 01:16PM

Photo Stories