Telangana: సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
Sakshi Education
జనగామ: విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో నాలుగు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న దీక్షల శిబిరాన్ని సెప్టెంబర్ 7నఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని అర్హతలున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు.
చదవండి: High Court: హరీశ్ పరీక్ష ఫలితాలు వెల్లడించండి
అంతకు ముందు ఉద్యోగులు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని తమ డిమాండ్లు నెరవేర్చాలని చిన్న కృష్ణుడి వేషధారణలో ఉన్న బాలుడికి పత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎన్.రాజు, బాధ్యులు వజ్రయ్య, అంకుశావళి, శ్రీరామ్, వెంకన్న, ప్రభాకర్, రాజేందర్, రాజారెడ్డి, రాజయ్య, లక్ష్మణ్, గణేష్, వరప్రసాద్, నరసింహనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 08 Sep 2023 02:40PM