Skip to main content

DEO Govindarajulu: ఎస్‌ఏ–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

కందనూలు: జిల్లావ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–1(సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌) పరీక్షలు ప్రారంభం కానున్నాయని డీఈఓ గోవిందరాజులు అక్టోబ‌ర్ 3న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
DEO Govindarajulu
ఎస్‌ఏ–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలోని 1,148 ప్రభుత్వ, ప్రైవేట్‌, గురుకులాల పాఠశాలల్లోని 1,07,554 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షలు గురువారం ప్రారంభమై 11 వరకు జరుగుతాయని చెప్పారు. 1– 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, 6, 7 తరగతులకు ఉదయం 10 నుంచి 12.45 గంటల వరకు, 9, 10 విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

హెచ్‌ఎంలు సంబంధిత ఎమ్మార్సీల నుంచి బుధవారం ప్రశ్నపత్రాలు తీసుకెళ్లాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎంఈఓలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు తమ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేసి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

Published date : 04 Oct 2023 04:02PM

Photo Stories