Skip to main content

English Medium: తెలుగు–ఆంగ్లం సమేతంగా.. కొత్త హంగులతో పుస్తకాలు

నిర్మల్‌ఖిల్లా: మారుతున్న కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ ప్రభుత్వ విద్య ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది.
English medium education for better opportunities  Along with Telugu and English  Government promoting English medium education

ఆంగ్ల మాధ్యమం ద్వారా ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించే అవకాశం ఉంది. ఇందుకుగాను పాఠ్యాంశాల రూపకల్పనలో విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని విద్యాశాఖ భావిస్తోంది. ఈ క్రమంలో గత మూడేళ్ల క్రితం నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది.

ఏటా ఒక్కో తరగతి పెంచుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం బోధించనున్నారు. గతంలో సక్సెస్‌ పాఠశాలల పేరిట కొన్ని ఉన్నత పాఠశాలల్లో మాత్రమే ఆంగ్లమాధ్యమ బోధన కొనసాగించారు. 2022–23 విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రారంభించారు.

విద్యార్థులు పాఠాలు తేలికగా అర్థం చేసుకునేందుకు పుస్తకాల ముద్రణలో మార్పులు చేశారు. ఇందులోభాగంగా పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాన్ని ఒక పక్క తెలుగు, మరోవైపు ఆంగ్లంలో ముద్రించడం విశేషం.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ 

పంపిణీకి ఏర్పాట్లు

మరో రెండు రోజుల్లో పాఠశాలల బడి గంటలు మోగనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ద్విభాష పాఠ్యపుస్తకాలు పంపిణీకి విద్యాశా ఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకోగా, మండలాల్లోని పాఠశాలలకు పంపిణీ ప్రక్రియ జరుగుతోంది.

అయితే గత విద్యాసంవత్సరం వరకు 9వ తరగతి వరకు ద్విభాష (తెలుగు, ఆంగ్ల భాషలో) ప్రచురితమైన పుస్తకాలు పంపిణీ చేయగా, ఈ విద్యాసంవత్సరం నుంచి టెన్త్‌ విద్యార్థులకు ఆ మాదిరిగా పుస్తకాలు అందజేయనున్నారు.

రెండు విభాగాలుగా పుస్తకాలు..

ప్రతి పుస్తకాన్ని ఆంగ్లం, తెలుగులో ముద్రిస్తే పుస్తకం పేజీల సంఖ్య రెట్టింపై విద్యార్థులకు బరువు పెరగకుండా రెండు విభాగాలుగా విభజించారు. పార్ట్‌–1, పార్ట్‌–2 పేరిట విభజించిన రెండు పుస్తకాలను జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు మొదటిభాగం, నవంబర్‌ నుంచి మార్చి వరకు రెండవ విభాగాలుగా విద్యార్థులకు, ఈ సంవత్సరం నుంచి టెన్త్‌ విద్యార్థులకు పుస్తకాలు అందజేయనున్నారు. తద్వారా ద్విభాషా పాఠ్యపుస్తకాల వల్ల విద్యార్థులు సులభతరంగా నేర్చుకునేందుకు వీలుంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కొత్త హంగులతో పుస్తకాలు..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే పుస్తకాలు కొత్త హంగులతో రూపొందించారు. ఆకట్టుకునే చిత్రాలు, కవర్‌ పేజీలతో ఉండనున్నాయి. పేజీలోని పాఠం పూర్తి వివరాల కోసం, సంబంధిత వీడియోల కోసం అక్కడ క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు.

మొబైల్‌తో స్కాన్‌ చేయగానే అదనపు సమాచారంతో కూడిన వీడియో, ఫోటోలు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇవి విద్యార్థులకు సరికొత్త ఆకర్షణీయంగా ఉన్నాయి.

తెలుగు, ఆంగ్లమాధ్యమాల్లో పాఠ్యాంశాలు..

తెలుగు మాధ్యమం నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆంగ్ల మాధ్యమం చదవాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుందని భావించిన విద్యాశాఖ ప్రతి పుస్తకాన్ని రెండు భాషల్లో ముద్రించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషా పుస్తకాలు కాకుండా గణితం, సామాన్య, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలు ఎడమవైపు పేజీలో తెలుగులో, కుడివైపు పేజీలో అదే పాఠ్యాంశాన్ని ఇంగ్లిష్‌లో ముద్రణ చేయించారు.

ఇక ప్రాథమిక స్థాయినుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాల్లో రెండు మాధ్యమాల్లో సులభంగా చదువుకునే అవకాశం ఉంది. ఇది విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉండనుంది.

విద్యార్థులకు అవగాహన సులభం

గ్రామీణప్రాంత విద్యార్థులకు పాఠం అవగాహన కోసం సులభతరం అవుతోంది. ద్విభాషా పుస్తకాల విధానం ద్వారా మెరుగైన ఫలితాల సాధనకు తోడ్పడుతుంది. ఉపాధ్యాయులకు ప్రయోజనం. పుస్తకాలు రెండు పార్ట్‌లుగా ఉండటం వల్ల విద్యార్థులపై భారం ఉండదు.

– మైస అరవింద్‌, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుడు, పొన్కల్‌

పంపిణీకి ఏర్పాట్లు

ఈ విద్యాసంవత్సరం నుంచి టెన్త్‌ విద్యార్థులకు తెలు గు, ఆంగ్ల మాధ్యమాల్లో పుస్తకాల ముద్రణ పూర్తయింది. పాఠశాల ప్రారంభం రోజునే పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు బోధన అభ్యసన ప్రక్రియ సులువవుతోంది.

– డాక్టర్‌ ఏ.రవీందర్‌ రెడ్డి, డీఈవో

Published date : 11 Jun 2024 10:05AM

Photo Stories