Skip to main content

Surya Prakash Rao: చదువుతో పాటు క్రీడలూ అవసరం

కొండపాక(గజ్వేల్‌): చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి సూర్య ప్రకాశ్‌రావు అన్నారు.
District Intermediate Officer Surya Prakash Rao at Kondapaka   Along with studies sports are also necessary   Encouraging sports in education at Kondapaka

మండల కేంద్రమైన కొండపాకలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ బాలికల విభాగం క్రీడలను జ‌నవ‌రి 12న‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్య ప్రకాశ్‌రావు మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. పోటీల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు.

చదవండి: Charvi Anilkumar: చిన్న‌ వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు

పోటీలో గెలుపొందిన విజేతలు జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు తోట సతీష్‌, కొండపాక ప్రిన్సిపాల్‌ అమరేందర్‌రెడ్డి, అబ్జర్వర్‌ బిక్కునాయక్‌, నీరజ, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు, వివిధ జిల్లాల కోచ్‌లు, 200 మంది క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Published date : 13 Jan 2024 04:12PM

Photo Stories