10th Class Public Exams: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్..
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త చెప్పింది.
టెన్త్ పరీక్షలను మే 23 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష సమయాన్ని 30 నిమిషాలు పొడిగించారు.గతంలో పరీక్ష సమయం 2 గంటల 45 నిమిషాలు ఉండగా.. ఇప్పుడు 3 గంటల 15 నిమిషాలకు పెంచారు.అలాగే 6 పేపర్లతోనే పరీక్షను నిర్వహించనున్నారు. అలాగే 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నారు. కరోనాతో పదో తరగతి క్లాసులు ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పదో తరగతి పరీక్షల టైం టేబుల్ ఇదే..
తేదీ | పరీక్ష |
23–5–22 | మొదటి భాష |
24–5–22 | ద్వితీయ భాష |
25–5–22 | తృతీయ భాష |
26–5–22 | గణితం |
27–5–22 | జనరల్ సైన్స్ |
28–5–22 | సోషల్ స్టడీస్ |
30–5–22 | ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్) |
31–5–22 | ఓఎస్సెస్సీ మెయిన్ (సంస్కృతం, అరబిక్) |
01–6–22 | ఎస్సెస్సీ ఒకేషనల్ కోర్సు |
Published date : 07 Apr 2022 01:35PM