Tenth Class: పదో తరగతి పరీక్ష ఫీజు ఈ తేదీ లోగా చెల్లించాలి
Sakshi Education
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి పరీక్షల ఫీజు ఈ నెల 17వ తేదీ వరకు చెల్లించాలని డీఈఓ రామారావు నవంబర్ 3న తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాలన్నారు. గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల కంటే తక్కువగా ఉంటే రూ.110, ఎక్కువగా ఉంటే రూ.125చెల్లించాలన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఆలస్య రుసుము రూ.50తో డిసెంబర్ ఒకటో తేదీ వరకు, రూ.200తో డిసెంబర్ 11వరకు, రూ.500తో డిసెంబర్ 20వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులు వార్షిక ఆదాయాన్ని బట్టి ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు.
Published date : 04 Nov 2023 03:21PM