‘TETను సజావుగా నిర్వహించాలి’
Sakshi Education
కామారెడ్డి క్రైం: టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)ను సజావుగా నిర్వహించాలని డీఈవో రాజు సూచించారు.
టెట్ నిర్వహణకో సం నియమించిన అధికారులకు సెప్టెంబర్ 8న కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఈవో మట్లాడుతూ సెప్టెంబర్ 15న నిర్వహించాల్సిన టెట్ కోసం జిల్లాకేంద్రంలో 24 పరీ క్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొదటి సెషన్‌లో 5,535 మంది, రెండో సెషన్‌లో 4,205 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారన్నారు.
పరీక్ష నిర్వహణ కోసం 100 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, హాల్ సూ పరింటెండెంట్లు, శాఖాధికారులను నియమించామన్నారు. పరీక్ష నిర్వహణపై అధికా రులు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. పలు అంశాలపై డీఈవో, పరీక్షల సహాయ సంచాలకుడు లింగం అవగాహన కల్పించా రు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే 76618 54856 నంబర్‌లో సంప్రదించాలని డీఈవో సూచించారు.
చదవండి: TS DSC 2023 : DSC సిలబస్, బెస్ట్ బుక్స్ ఇవే..| ముందుగానే..ఇలా చదివితే 'టీచర్' ఉద్యోగం మీదే..
Published date : 09 Sep 2023 02:40PM