TS TET 2023 Exam: టెట్ ప్రశాంతం
ఉదయం మొదటి పేపర్‌కు మొత్తం 9,943 మంది అభ్యర్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 8,075మంది (81.21శాతం) హాజరైనట్లు డీఈఓ ఎండీ అబ్దుల్‌హై, ఏసీజీ డి.చలపతిరావు తెలిపారు. మధ్యాహ్నం 39 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9,051 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 8,337మంది(92.10శాతం) హాజరైనట్లు వారు తెలిపారు. కాగా.. ఈపరీక్షల నిర్వహణ తీరును హనుమకొండలోని జేఎస్‌ఎం, షైన్ విద్యా సంస్థల పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సిక్తాపట్నాయక్, డీఈఓ కార్యాలయ ఏసీజీ డి.చలపతిరావు పరిశీలించారు.
TS TET 2023 Paper-1 Question Paper #sakshieducation
అభ్యర్థుల ఆందోళన
టీచర్ల బదిలీలు, పదోన్నతుల ద్వారా ఏర్పడే వేకెన్సీలను డీఎస్సీ నోటిఫికేషన్‌లో జత చేయాలని హనుమకొండలోని పరీక్ష కేంద్రం వద్ద పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే డీఎస్సీకి నాలుగు నెలల సమయం ఇవ్వాలని అభ్యర్థ్ధులు నినాదించారు.
TS TET 2023 Paper-2 Question Paper #sakshieducation
వరంగల్ జిల్లాలో..
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లాలో నిర్వహించిన టెట్–2023 ప్రశాంతంగా ముగిసింది. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 4,780 మంది హాజరు కావాల్సి ఉండగా.. 3,910 మంది హాజరయ్యారు. 870 మంది గైర్హాజరైనట్లు డీఈఓ వాసంతి తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 4,267 మందికి 3,921 మంది హాజరయ్యారు. 346 మంది గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు.
- మొదటి పేపర్‌కు 81.21 శాతం హాజరు
- రెండో పేపర్‌కు 92.10 శాతం..
APPSC Group 1 and 2: ఇవి ఫాలో ఐతే జాబ్ చేస్తూకూడా ఉద్యోగం సాధించవచ్చు.. #sakshieducation