Language: భాషా పండితుల సమస్య
ఉమ్మడి రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించినట్లు మాదిరిగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో భాషా పండితుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించినట్లు మన రాష్ట్రంలో కూడా నిర్వహించాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా! ఎన్‌సీటీఈ నిబంధనల లోపం వల్ల ప్రతి సారీ టెట్‌లో భాషాపండితులకు నష్టం జరుగుతోంది. టెట్‌లో అర్హత సాధించిన తరువాత టీచర్ ఉద్యోగం వస్తే... భాషా పండితులు కేవలం తెలుగు మాత్రమే బోధించాలి.
అలాంటప్పుడు ఈ నియమాలు ఎందుకు? టెట్ ప్రారంభమైనప్పటి నుంచీ భాషా పండితులు సోషల్ కంటెంట్ – మెథడాలజీ రాయాల్సి వస్తుందనీ, దీనివలన తాము ఎక్కువ మార్కులు స్కోరు చేయలేక పోతున్నా మనీ ఆవేదన చెందుతున్నారు. అందువలన తెలుగు సబ్జె క్టుకు 90 మార్కులు, పెడగాగికు 30 మార్కులు, ఇంగ్లిష్‌కు 30 మార్కులు కేటాయించాలని కోరడంలో న్యాయ ముంది. టెట్ రాసిన ప్రతి సారీ అభ్యర్థులు తక్కువ వెయి టేజీతో ఉద్యోగాలు కోల్పోవడం బాధకరం. ఇప్పుడున్న పద్ధతిలో అయితే... తెలుగుకు 30 మార్కులు, పెడగాగికు 30 మార్కులు, ఇంగ్లిష్‌కు 30 మార్కులు, సోషల్‌కు 60 మార్కులున్నాయి.
ఒకసారి టెట్ రాసి క్వాలిఫై అయితే జీవితకాలం పాటు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించడంతో అందరూ ఈసారి తమ ప్రతిభను పరీక్షించుకోవాలని ఆరాటపడు తున్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే టెట్‌లో తెలుగు కోసం ప్రత్యేకంగా పేపర్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– కాళేశ్వరం కృష్ణమూర్తి, హన్మకొండ