SI Success Story: తల్లి పడ్డ ఒంటరి కష్టం కృషి
కడుపులో బిడ్డ ఉండగానే భర్త చనిపోగా అత్తగారింటికి వచ్చి వ్యవసాయం మొదలు పెట్టింది హనుమవ్వ. మూడెకరాల్లో పంటలను సాగు చేస్తూ కొడుకును చదివించింది. మధ్యలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాగా చివరికి ఎకరంన్నర భూమిని సైతం విక్రయించింది. అయినా దిగులు చెందకుండా, ఉన్న పొలంలోనే శ్రమించి, ఆ పంటను అమ్మడానికి నిజామాబాద్ గంజ్‌కు వెళ్లేది. పొలం పనులను నేటికీ హనుమవ్వ ఒక్కతే చేసుకుంటుంది. తన కొడుకు ఎస్సై అయినా కూడా తనకు జీవితాన్ని చూపిన వ్యవసాయాన్ని మాత్రం మరవలేదు.
Women Success as Entrepreneur: యువతి పారిశ్రామికవేత్తగా పొందిన పురస్కారం
తల్లి పడ్డ కష్టానికి ఫలితంగా కొడుకు రాజారెడ్డి సైతం ఉన్నత చదువులతో మొదట కానిస్టేబుల్‌గా ఎంపికై అనంతరం ఎస్సై పరీక్షలు రాసి విజయం పొంది, ప్రస్తుతం నవీపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.
కష్టం అనిపించలే..
ఎడునెలల కొడుకు కడుపులో ఉన్నప్పుడే నా భర్త మరణించాడు. చాలా కఠినమైన పరిస్థితి ఉండేది. ఆడదానిగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. పొలం పనులు చేస్తూ కొడుకు ప్రయోజకుడిని చేయాలనే తపన మాత్రమే నాలో ఉండేది. వ్వవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాను. నేటికి కూడా వ్యవసాయం చేస్తున్నా. నా కొడుకు ఎస్సై కావడం ఎంతో సంతోషంగా ఉంది. – హనుమవ్వ, పిప్రి
Success Story: ఈ జంట సాధించిన విజయంతో వారి ఇంట వేడుకలు రెట్టింపు...