Engineer Success as Farmer: వ్యవసాయంలో విజయం పొందిన ఉద్యోగి.. ఎలా?
ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేసేవారు మాత్రమే ఎక్కువ సంపాదిస్తారని చాలా మంది నమ్మకం. అయితే ఆధునిక కాలంలో చదువు మాత్రమే కాదు తెలివితేటలతో కూడా బాగా సంపాదించవచ్చని ఎంతోమంది నిరూపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు మహారాష్ట్రకు చెందిన 'ప్రమోద్ గౌతమ్'.
మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ గౌతమ్ ఇంజనీర్ జాబ్ వదిలి, భారతదేశంలోని ధనిక రైతులలో ఒకరుగా మారి.. ఐఐటీ, ఐఐఎమ్, కొన్ని కంపెనీలలో పనిచేసే సీఈఓల కంటే ఎక్కువ సంపాదిస్తూ.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నిజానికి ఇతడు MNCలో ఆటోమొబైల్ ఇంజనీర్‌గా పని చేసేవాడు.
హార్టికల్చర్..
ఉద్యోగంలో సంతృప్తి చెందని ప్రమోద్ జాబ్ వదిలి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకున్న 26 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే సాధారణ వ్యవసాయ పంటలు కాకుండా హార్టికల్చర్ (ఉద్యాన పంటలు) విధానం ఎంచుకుని గ్రీన్‌హౌస్‌లో పండ్లు, కూరగాయలను పండించాడు.
పండించిన పంటలు..
ప్రారంభంలో వేరుశెనగ, పసుపు సాగుతో చిన్నగా ప్రారంభించాడు. కానీ పెద్దగా లాభం లేకపోవడంతో పప్పుకి సంబంధించిన పంటలు పండించాలనుకున్నాడు. కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేసి మంచి దిగుబడులను పొందాడు. తరువాత అతి తక్కువ కాలంలోనే వందన ఫుడ్స్ ప్రారంభించి దీని కింద వివిధ రకాల పప్పులు, ధాన్యాలను విక్రయించడం ప్రారంభించాడు. ఈ ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.
Success Story: ఓకే సారి గ్రూప్-2కు తండ్రీ కొడుకులు సెలక్ట్.. వీరి సక్సెస్ సిక్రెట్ చూస్తే..
ఈ రైతు ఆదాయం..
ఇక ప్రమోద్ గౌతమ్ ఆదాయం విషయానికి వస్తే.. ఇతడు నెలకు రూ. 10 నుంచి రూ. 12 లక్షలు సంవత్సరానికి సుమారు రూ. 1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో మొత్తం దేశంలోనే అత్యంత ధనిక రైతుగా నిలిచాడు. వ్యవసాయం మీద మక్కువతో ఉద్యోగం వదిలి ఈరోజు దేశంలోని టాప్ 10 ధనిక రైతులలో ఒకరుగా నిలిచారు.