హెచ్-4 వీసా రద్దయితే...ప్రత్యామ్నాయమేంటి !
Sakshi Education
హెచ్-4 వీసా రద్దు దిశగా ట్రంప్ సర్కారు శరవేగంగా అడుగులు వేస్తోంది. జూన్-2018 నాటికి రద్దు చేస్తామని చెబుతోంది. మరికొద్ది రోజుల్లోనే హెచ్-4 వీసా రద్దు ప్రక్రియ పూర్తిచేస్తామని మే 24వ తేదీన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, ఫెడరల్ కోర్టుకు తెలిపింది. దాంతో అమెరికాలో హెచ్-4వీసాతో పనిచేస్తున్న వారితోపాటు వారి జీవిత భాగస్వాముల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.
వాస్తవానికి హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాముల కోసం 2015లో ఒబామా ప్రభుత్వం హెచ్-4 (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) తెచ్చింది. ఫలితంగా భారతీయులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ప్రయోజనం పొందారు. ఇప్పుడు ఈ వీసా రద్దు అమెరికాలో పనిచేస్తున్న లక్షకుపైగా భారతీయ కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎన్నో కలలతో అమెరికాలో అడుగుపెట్టి.. హెచ్-4 వీసా రద్దు కారణంగా స్వదేశానికి తిరిగొచ్చేయాల్సిందేనా?! హెచ్-4 వీసా రద్దుతో భారతీయులపై పడే ప్రభావం.. ప్రత్యామ్నాయ మార్గాల గురించి తెలుసుకుందాం..
ట్రంప్ ఎఫెక్ట్ :
హెచ్-4 డిపెండెంట్ వీసా.. 2015లో బరాక్ ఒబామా హయాంలో అమెరికాలో పని చేస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునే విధంగా అమల్లోకి తెచ్చిన విధానం. కానీ.. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో అమెరికా యువతకే ప్రాధాన్యం ఇస్తామంటోంది. ఆ దిశగా అడుగులు వేస్తూ.. విదేశీయులకు మంజూరు చేస్తున్న పలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం.. రద్దు చేయడం వంటి చర్యలు చేపడుతోంది. ఆ క్రమంలోనే జూన్ 2018 నాటికల్లా హెచ్-4 వీసా విధానాన్ని రద్దు చేయనున్నట్లు పేర్కొంది.
భారతీయులపై అధిక ప్రభావం..
హెచ్-4 వీసా రద్దు.. భారతీయులపై అధిక ప్రభావం చూపనుంది. హెచ్-4 అమల్లోకి వచ్చిన 2015 నుంచి జారీ అయిన గణాంకాలను పరిశీలిస్తే.. వీరిలో తొంభై శాతం మంది భారతీయులే ఉంటున్నారు. 2017లో మొత్తం 1,36,393 మందికి హెచ్-4 వీసాలు మంజూరు చేయగా.. వీరిలో భారతీయుల సంఖ్య 1,17,522. 2017లో హెచ్-1బి వీసా పొందిన భారతీయుల సంఖ్య 1,29,097. దీన్నిబట్టి హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాముల్లో 90 శాతం మంది హెచ్-4 వీసాతో ఉద్యోగాలు చేస్తున్న విషయం స్పష్టమవుతోంది.
ప్రత్యామ్నాయ మార్గాలు లేవా ?
హెచ్ 4 వీసా రద్దు అయిన వారికి పలు ప్రత్యామ్నాయాలను నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటి విషయంలో చాలా పరిమితులు, నిబంధనలు ఉండటం ప్రధాన సమస్యగా మారింది.
హెచ్-1కు దరఖాస్తు :
హెచ్-4 రద్దు ప్రభావానికి గురయ్యే వారికి అందుబాటులో ఉన్న ప్రధాన ప్రత్యామ్నాయం.. హెచ్-4 గడువు ముగిసే లోగా.. తమకున్న అర్హతలతో కొత్త కంపెనీలో హెచ్-1 కేటగిరీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం. ఈ మార్గంలో ఉద్యోగం దక్కించుకుని సదరు ఎంప్లాయర్ ద్వారా హెచ్-1బి కోసం దరఖాస్తు చేయించుకోగలిగితే అమెరికాలోనే ఉద్యోగం చేస్తూ కొనసాగొచ్చు. కాని అది అంత తేలిక కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎల్-2 వీసా :
హెచ్-4 వీసా బాధితులకు మరో ప్రత్యామ్నాయం.. ఎల్-2 వీసా. దీని ప్రకారం.. ఎల్-1 వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తుల జీవిత భాగస్వాములు ఎల్-2 డిపెండెంట్ వీసాతో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే.. హెచ్-4 డిపెండెంట్ వీసా కంటే ఎల్-2 డిపెండెంట్ వీసాకు అధిక ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఎల్-2 వీసా విధానంలో ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) పొందితే.. ఉద్యోగం, రంగాల పరంగా ఎలాంటి పరిమితులు లేవు. వారికున్న అర్హతల ఆధారంగా పార్ట్ టైమ్, ఫుల్‌టైమ్, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్.. ఇలా పలు విధానాల్లో ఉద్యోగం చేస్తూ సంపాదించుకునే అవకాశముంది. ఇక్కడ ప్రధాన సమస్య.. ముందుగా ఈఏడీ వస్తే తప్ప ఉద్యోగం చేసుకునే అవకాశం లేదు. తొలుత ఈఏడీని రెండేళ్ల కాల వ్యవధికి మంజూరు చేస్తారు. ఆ తర్వాత.. దీన్ని పునరుద్ధరించుకునే అవకాశముంది. తమ జీవిత భాగస్వామికి లభించిన ఎల్-1 వీసా కాల పరిమితి ముగిసే వరకు ఎల్-2 ఈఏడీ అమల్లో ఉంటుంది. ఈ ఎల్1 వీసా అమెరికాతోపాటు వేరే విదేశంలోనూ కార్యాలయాలు ఉన్న ఎంఎన్‌సీ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు ఉద్దేశించింది. విదేశంలో కనీసం ఒక సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత అమెరికాలోని సదరు కంపెనీ కార్యాలయంలో విధులు నిర్వహించడం కోసం ఎల్1 వీసా జారీచేస్తారు. వీరి జీవిత భాగస్వాములు ఎల్-2 వీసా పొందే వీలుంది.
ఒ-1 వీసా :
అమెరికాలో ఉద్యోగం చేసేందుకు మరో ప్రత్యామ్నాయ మార్గం.. ఒ-1 వీసా విధానం. దీని ప్రకారం.. సెన్సైస్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్, అథ్లెటిక్స్ తదితర విభాగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలు, అర్హతులున్న వారికి ఈ వీసా లభిస్తుంది. ఈ విషయంలోనూ అభ్యర్థులను నియమించుకునే సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎఫ్-1.. ఓపీటీ
హెచ్-4 విధానం రద్దు బాధితులకు అందుబాటులో ఉన్న పై ప్రత్యామ్నాయాలేవి అనుకూలించని పరిస్థితి.. మరోవైపు తప్పనిసరిగా అమెరికాలోనే జీవిత భాగస్వామితో ఉండాలి.. అదే సమయంలో ఉద్యోగం కూడా చేయాలి అనుకుంటే.. అలాంటి వారికి అందుబాటులో ఉన్న మార్గం ఎఫ్-1 (స్టూడెంట్ వీసా) వీసా. అంటే.. సదరు వ్యక్తులు అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ఏదైనా మాస్టర్ కోర్సులో చేరి.. ఆ తర్వాత లభించే ఓపీటీ(ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) విధానాన్ని వినియోగించుకోవాలి. ఈ ఓపీటీ విధానం ప్రకారం- స్టెమ్(సైన్‌స, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి తొలుత 12 నెలల వ్యవధిలో సంబంధిత విభాగానికి చెందిన సంస్థల్లో పని చేసే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత మరో 24 నెలల వరకూ దీన్ని పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం అమెరికాలో స్టెమ్ నిపుణుల కొరత ఉంది. కాబట్టి స్టెమ్ కోర్సుల్లో మాస్టర్ ప్రోగ్రామ్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఓపీటీ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో హెచ్-1 వీసా పొందేందుకు మార్గం సులభం అవుతుంది.
2015 నుంచి 2017 వరకు జారీ చేసిన హెచ్-4 వీసా గణంకాలు.. అందులో భారతీయుల సంఖ్య వివరాలు..
2015-2017 మధ్య భారతీయులకు లభించిన హెచ్-1బీ వీసాలు, హెచ్-4 వీసాలు..
- 'పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వెంకట్(పేరు మార్చాం) ఎంఎస్ పూర్తి చేసి.. యూఎస్‌లోని బే ఏరియాలో ఓ ప్రముఖ సంస్థలో హెచ్-1బి వీసాతో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య ప్రశాంతి(పేరు మార్చాం) కూడా ఉన్నత విద్యావంతురాలే. హెచ్-4 వీసా వెసులుబాటు ఫలితంగా ఎంబీఏ అర్హతతో ఆమె అదే ప్రాంతంలో మరో సంస్థలో ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరూ కష్టపడుతూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఇప్పుడు హెచ్-4 వీసా రద్దు ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఆకుటుంబంలో ఆందోళన నెలకొంది. రకరకాల ప్రత్యామ్నాయాల దిశగా ఆమె ఆలోచిస్తున్నారు. భారత్‌కు తిరిగొచ్చేందుకు సైతం సిద్ధపడ్డారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సివిల్స్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకునేందుకు వీలుగా వివరాలు సేకరించారు.
- హైదరాబాద్‌కు చెందిన రమేశ్.. ఇక్కడ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తూ.. ఆ సంస్థకు కాలిఫోర్నియాలో ఉన్న కార్యాలయంలో రెండేళ్ల క్రితం పని చేసేందుకు వెళ్లారు. సంస్థ హెచ్-1బి కోసం దరఖాస్తు చేయగా.. అనుమతి లభించింది. దాంతో రమేశ్.. తన భార్య వాసంతిని కూడా అమెరికా తీసుకెళ్లారు. హెచ్-4 ఆధారంగా ఆమె అక్కడే ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు హెచ్-4 రద్దు దిశగా అడుగులు పడుతున్న పరిస్థితి. దాంతో ఆమె హైదరాబాద్‌కు తిరిగొచ్చి తన అర్హతల(ఎమ్మెస్సీ-కంప్యూటర్స్) ఆధారంగా ఇక్కడే ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని భావిస్తున్నారు.
- హెచ్-4 వీసాల రద్దు ప్రక్రియ చివరి దశలో ఉన్నట్లు అమెరికా ప్రభుత్వం కోర్టుకు తెలపడం.. జూన్‌లో ఈ రద్దు ప్రక్రియ పూర్తవుతుందనే వార్తల నేపథ్యంలో.. అమెరికాలో పనిచేస్తున్న వేల మంది భారతీయుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే హెచ్-4 వీసాతో ఉద్యోగాలు చేస్తున్న హెచ్-1బి వీసాదారుల జీవిత భాగస్వాములు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు. తక్కువ విద్యార్హతలున్న వారి పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. తక్కువ విద్యార్హతలతో అక్కడ చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్న వారు.. జీవిత భాగస్వామిని వదిలి స్వదేశానికి తిరిగి రాలేక.. అదే సమయంలో హెచ్-4 రద్దయితే అక్కడ ఖాళీగా ఉండలేమనే ఆవేదనతో కాలం గడుపుతున్నారు. అప్పులు చేసి ఇప్పటికే అక్కడ స్థిర, చరాస్తులు కొనుకున్న కుటుంబాల్లో భార్య, భర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే కానీ.. వాటికి సంబంధించిన వాయిదాలు చెల్లించలేని పరిస్థితి!!
ట్రంప్ ఎఫెక్ట్ :
హెచ్-4 డిపెండెంట్ వీసా.. 2015లో బరాక్ ఒబామా హయాంలో అమెరికాలో పని చేస్తున్న విదేశీయుల జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునే విధంగా అమల్లోకి తెచ్చిన విధానం. కానీ.. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అన్ని ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో అమెరికా యువతకే ప్రాధాన్యం ఇస్తామంటోంది. ఆ దిశగా అడుగులు వేస్తూ.. విదేశీయులకు మంజూరు చేస్తున్న పలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం.. రద్దు చేయడం వంటి చర్యలు చేపడుతోంది. ఆ క్రమంలోనే జూన్ 2018 నాటికల్లా హెచ్-4 వీసా విధానాన్ని రద్దు చేయనున్నట్లు పేర్కొంది.
భారతీయులపై అధిక ప్రభావం..
హెచ్-4 వీసా రద్దు.. భారతీయులపై అధిక ప్రభావం చూపనుంది. హెచ్-4 అమల్లోకి వచ్చిన 2015 నుంచి జారీ అయిన గణాంకాలను పరిశీలిస్తే.. వీరిలో తొంభై శాతం మంది భారతీయులే ఉంటున్నారు. 2017లో మొత్తం 1,36,393 మందికి హెచ్-4 వీసాలు మంజూరు చేయగా.. వీరిలో భారతీయుల సంఖ్య 1,17,522. 2017లో హెచ్-1బి వీసా పొందిన భారతీయుల సంఖ్య 1,29,097. దీన్నిబట్టి హెచ్-1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాముల్లో 90 శాతం మంది హెచ్-4 వీసాతో ఉద్యోగాలు చేస్తున్న విషయం స్పష్టమవుతోంది.
ప్రత్యామ్నాయ మార్గాలు లేవా ?
హెచ్ 4 వీసా రద్దు అయిన వారికి పలు ప్రత్యామ్నాయాలను నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటి విషయంలో చాలా పరిమితులు, నిబంధనలు ఉండటం ప్రధాన సమస్యగా మారింది.
హెచ్-1కు దరఖాస్తు :
హెచ్-4 రద్దు ప్రభావానికి గురయ్యే వారికి అందుబాటులో ఉన్న ప్రధాన ప్రత్యామ్నాయం.. హెచ్-4 గడువు ముగిసే లోగా.. తమకున్న అర్హతలతో కొత్త కంపెనీలో హెచ్-1 కేటగిరీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం. ఈ మార్గంలో ఉద్యోగం దక్కించుకుని సదరు ఎంప్లాయర్ ద్వారా హెచ్-1బి కోసం దరఖాస్తు చేయించుకోగలిగితే అమెరికాలోనే ఉద్యోగం చేస్తూ కొనసాగొచ్చు. కాని అది అంత తేలిక కాదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎల్-2 వీసా :
హెచ్-4 వీసా బాధితులకు మరో ప్రత్యామ్నాయం.. ఎల్-2 వీసా. దీని ప్రకారం.. ఎల్-1 వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తుల జీవిత భాగస్వాములు ఎల్-2 డిపెండెంట్ వీసాతో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే.. హెచ్-4 డిపెండెంట్ వీసా కంటే ఎల్-2 డిపెండెంట్ వీసాకు అధిక ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఎల్-2 వీసా విధానంలో ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) పొందితే.. ఉద్యోగం, రంగాల పరంగా ఎలాంటి పరిమితులు లేవు. వారికున్న అర్హతల ఆధారంగా పార్ట్ టైమ్, ఫుల్‌టైమ్, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్.. ఇలా పలు విధానాల్లో ఉద్యోగం చేస్తూ సంపాదించుకునే అవకాశముంది. ఇక్కడ ప్రధాన సమస్య.. ముందుగా ఈఏడీ వస్తే తప్ప ఉద్యోగం చేసుకునే అవకాశం లేదు. తొలుత ఈఏడీని రెండేళ్ల కాల వ్యవధికి మంజూరు చేస్తారు. ఆ తర్వాత.. దీన్ని పునరుద్ధరించుకునే అవకాశముంది. తమ జీవిత భాగస్వామికి లభించిన ఎల్-1 వీసా కాల పరిమితి ముగిసే వరకు ఎల్-2 ఈఏడీ అమల్లో ఉంటుంది. ఈ ఎల్1 వీసా అమెరికాతోపాటు వేరే విదేశంలోనూ కార్యాలయాలు ఉన్న ఎంఎన్‌సీ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు ఉద్దేశించింది. విదేశంలో కనీసం ఒక సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత అమెరికాలోని సదరు కంపెనీ కార్యాలయంలో విధులు నిర్వహించడం కోసం ఎల్1 వీసా జారీచేస్తారు. వీరి జీవిత భాగస్వాములు ఎల్-2 వీసా పొందే వీలుంది.
ఒ-1 వీసా :
అమెరికాలో ఉద్యోగం చేసేందుకు మరో ప్రత్యామ్నాయ మార్గం.. ఒ-1 వీసా విధానం. దీని ప్రకారం.. సెన్సైస్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్, అథ్లెటిక్స్ తదితర విభాగాల్లో అత్యుత్తమ నైపుణ్యాలు, అర్హతులున్న వారికి ఈ వీసా లభిస్తుంది. ఈ విషయంలోనూ అభ్యర్థులను నియమించుకునే సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎఫ్-1.. ఓపీటీ
హెచ్-4 విధానం రద్దు బాధితులకు అందుబాటులో ఉన్న పై ప్రత్యామ్నాయాలేవి అనుకూలించని పరిస్థితి.. మరోవైపు తప్పనిసరిగా అమెరికాలోనే జీవిత భాగస్వామితో ఉండాలి.. అదే సమయంలో ఉద్యోగం కూడా చేయాలి అనుకుంటే.. అలాంటి వారికి అందుబాటులో ఉన్న మార్గం ఎఫ్-1 (స్టూడెంట్ వీసా) వీసా. అంటే.. సదరు వ్యక్తులు అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లలో ఏదైనా మాస్టర్ కోర్సులో చేరి.. ఆ తర్వాత లభించే ఓపీటీ(ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) విధానాన్ని వినియోగించుకోవాలి. ఈ ఓపీటీ విధానం ప్రకారం- స్టెమ్(సైన్‌స, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విభాగాల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన వారికి తొలుత 12 నెలల వ్యవధిలో సంబంధిత విభాగానికి చెందిన సంస్థల్లో పని చేసే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత మరో 24 నెలల వరకూ దీన్ని పొడిగించుకోవచ్చు. ప్రస్తుతం అమెరికాలో స్టెమ్ నిపుణుల కొరత ఉంది. కాబట్టి స్టెమ్ కోర్సుల్లో మాస్టర్ ప్రోగ్రామ్ పూర్తి చేసి.. ఆ తర్వాత ఓపీటీ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో హెచ్-1 వీసా పొందేందుకు మార్గం సులభం అవుతుంది.
2015 నుంచి 2017 వరకు జారీ చేసిన హెచ్-4 వీసా గణంకాలు.. అందులో భారతీయుల సంఖ్య వివరాలు..
సంవత్సరం | మొత్తం వీసాలు | భారతీయులకు లభించినవి |
2015 | 1,24,484 | 1,02,119 |
2016 | 1,31,051 | 1,10,003 |
2017 | 1,36,393 | 1,17,522 |
2015-2017 మధ్య భారతీయులకు లభించిన హెచ్-1బీ వీసాలు, హెచ్-4 వీసాలు..
సంవత్సరం | హెచ్-1బీ వీసాలు | హెచ్-4 వీసాలు |
2015 | 1,19,952 | 1,02,119 |
2016 | 1,26,692 | 1,10,003 |
2017 | 1,29,097 | 1,17,522 |
- 2015 నుంచి 2017 మధ్య కాలంలో మంజూరైన హెచ్-1బి, హెచ్-4 వీసాలను పరిశీలిస్తే.. భారత్ నుంచి హెచ్-1బి వీసా పొందిన వ్యక్తుల జీవిత భాగస్వాములకే అధికంగా హెచ్-4 వీసాలు లభించినట్లు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
కెనడా వైపు చూపు..
అమెరికాకు సమీపంలోనే ఉన్న కెనడాలో ఇప్పుడు విదేశీ నిపుణులను ఆకర్షించే విధంగా పలు సానుకూల విధానాలను అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. గతేడాది ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ వీసా స్కీమ్‌ను సైతం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మూడు విధానాలు.. ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్, ఫెడరల్ స్కిల్డ్ ట్రేడ్స్ ప్రోగ్రామ్, కెనడియన్ ఎక్స్‌ప్రెస్ క్లాస్.. అమల్లో ఉన్నాయి. ఫెడరల్ స్కిల్డ్ వర్కర్స్ ప్రోగ్రామ్ విధానం ద్వారా.. పీజీ డిగ్రీ అర్హతతోపాటు ఒక ఏడాది పని అనుభవం ఉన్న వారికి కెనడా కంపెనీల్లో పని చేసే అవకాశం లభిస్తే వీసా సులువుగా మంజూరు చేస్తారు. హెచ్-1బి వీసా హోల్డర్లు ఈ దిశగా దృష్టిసారిస్తే కెనడాలో ఉద్యోగావకాశాలు మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
జీవిత భాగస్వాములు సైతం ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు కెనడా ప్రభుత్వం ఫెడరల్ స్కిల్డ్ ట్రేడ్స్ ప్రోగ్రామ్స్ విధానం అమలు చేస్తోంది. దీని ప్రకారం ఆయా వృత్తులకు సంబంధించిన నైపుణ్యాల ద్వారా కెనడాలోని పరిశ్రమల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్న వారికి త్వరగానే వీసా లభిస్తుంది. కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ స్కీమ్ మరో ప్రత్యేకత.. ఆఫర్ లెటర్, స్పాన్సర్‌షిప్ లెటర్ లేకపోయినా.. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ స్కీమ్ ప్రకారం పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం హెచ్-4 రద్దు దిశగా అడుగుల నేపథ్యంలో అమెరికాలో హెచ్-1బి వీసా ఆధారంగా పని చేస్తున్న అధిక శాతం మంది కెనడావైపే దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు.
ప్రత్యామ్నాయాలకూ పరిమితులు..
హెచ్4 వీసా విధానం రద్దు నేపథ్యంలో... అమెరికాలో ఉద్యోగం చేస్తూ నివసించేందుకు ఇప్పుడు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ.. వాటికి చాలా పరిమితులున్నాయి. ఎల్-1 వీసా ఉద్యోగం పొందేవారికి ఇచ్చే వేతనాల మొత్తాలపై అక్కడి ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఒ-1 వీసాలు ఉన్నప్పటికీ.. సంబంధిత రంగాల్లో అత్యున్నత నైపుణ్యాలు, అర్హతలున్న వారికే అవకాశం లభిస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే.. విదేశాల్లోనే ఉండాలనుకునే హెచ్-1, హెచ్-4 వీసా హోల్డర్లు ఇతర దేశాలవైపు దృష్టి సారించడం మేలు. కెనడా, ఆస్ట్రేలియాలు మెరుగైన ప్రత్యామ్నాయ గమ్యాలుగా పేర్కొనొచ్చు.
- వంశీకృష్ణ, మేనేజర్, ఏఈసీసీ గ్లోబల్

Published date : 08 Jun 2018 04:20PM