Skip to main content

విదేశాల్లో ఉన్నత విద్యకు పాపులర్ కోర్సులు...

విదేశాల్లో ఉన్నత చదువు.. ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చే దేశాలు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా..! ఎన్నాళ్లుగానో భారత విద్యార్థుల ప్రాధాన్యతా జాబితాలో నిలుస్తున్నాయీ దేశాలు. పోటీ ప్రపంచం.. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరో అయిదారు దేశాలూ విద్యా పరంగా మన విద్యార్థులకు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. గాలివాటుగా ఏదో ఒక దేశం.. ఏదో ఒక కోర్సు.. అని
సరిపెట్టుకోకుండా ఎక్కడ ఏది పాపులర్..? మనం చేరాలనుకుంటున్న కోర్సుకు తగిన దేశం ఏది..?ఎందులో చదివితే కెరీర్‌లో మంచి అవకాశాలు అందుకునే వీలుంటుంది..? అనే అంశాలను తెలుసుకోవడం ఉత్తమం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో.. స్ప్రింగ్ సీజన్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విదేశీ విద్య ఔత్సాహికులకు ఉపయోగపడేలా ‘బెస్ట్ కంట్రీస్.. పాపులర్ కోర్సుల’ సమాచారం..

అమెరికా..
ఎన్ని కఠిన నిబంధనలు విధిస్తున్నా.. విదేశీ విద్య కోణంలో ఇప్పటికీ ఉత్తమ గమ్యంగా నిలుస్తోంది అమెరికా. ఇక్కడకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఇటీవల కొంత తగ్గినప్పటికీ.. ఇతర దేశాలకు పయనమవుతున్నవారితో పోల్చినప్పుడు మాత్రం అమెరికాదే అగ్రస్థానం. (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సులకు అమెరికా బాగా ప్రసిద్ధి. వీటితోపాటు బిజినెస్ మేనేజ్‌మెంట్; లైఫ్/ఫిజికల్ సెన్సైస్; సోషల్ సెన్సైస్ కోర్సులను అందించడంలోనూ ఇక్కడి విశ్వ విద్యాలయాలకు మంచి పేరుంది. మన దేశం నుంచి వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం ఎంఎస్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

స్టెమ్ కోర్సుల్లో మాస్టర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పేరుతో మూడేళ్ల వరకు అమెరికాలోనే ఏదైనా సంస్థల్లో పని చేసే అవకాశం లభిస్తుంది. ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వ్యవధిని తగ్గించడం లేదా రద్దు చేయాలని ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం యోచిస్తుండటం ప్రతికూలాంశం.
అకడమిక్ సెషన్ ప్రారంభం: సెప్టెంబర్, జనవరి నెలలు

పాపులర్ కోర్సులు :
  • స్టెమ్ కోర్సులు
  • బిజినెస్ మేనేజ్‌మెంట్
  • లైఫ్/ఫిజికల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్

ఉత్తమ విశ్వవిద్యాలయాలు...
1. హార్వర్డ్ యూనివర్సిటీ
2. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
3. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ
4. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ
5. కాలిఫోర్నియా యూనివర్సిటీ
6. యేల్ యూనివర్సిటీ
7. మిచిగాన్ యూనివర్సిటీ
8. కొలంబియా యూనివర్సిటీ
9. యూనివర్సిటీ ఆఫ్ చికాగో
10. కార్నెగీ మిలన్ యూనివర్సిటీ
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.educationusa.state.gov, www.usnews.com

యునెటైడ్ కింగ్‌డమ్...

  • భారతీయ విద్యార్థులకు మరో ఉత్తమ గమ్యస్థానంగా నిలుస్తున్న దేశం.. యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే). ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో బిజినెస్ స్టడీస్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ కోర్సులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోంది. ప్రధానంగా మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, ఎకనామిక్స్, బ్యాంకింగ్, లా కోర్సులకు యూకే చిరునామాగా నిలుస్తోంది.
  • యూకేలో మన విద్యార్థులకు కలిసొస్తున్న అంశం.. చాలా వర్సిటీల్లో పీజీ కోర్సును ఏడాది వ్యవధిలో పూర్తి చేసే అవకాశం ఉండటం.
  • అకడమిక్ సెషన్ ప్రారంభం : సెప్టెంబర్, జనవరి. సెషన్‌కు కనీసం ఏడాది ముందు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం మేలు.
పాపులర్ కోర్సులు..
  • ఇంజనీరింగ్
  • బిజినెస్ స్టడీస్
  • హుమ్యానిటీస్ కోర్సెస్
ఉత్తమ విశ్వవిద్యాలయాలు :
1. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
2. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
3. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్
4. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్
5. యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్
6. వార్విక్ యూనివర్సిటీ
7. కింగ్స్ కాలేజ్
8. ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ
9. లాంకెస్టర్ యూనివర్సిటీ
10. గ్లాస్గో యూనివర్సిటీ
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ukvisas.gov.uk


ఆస్ట్రేలియా ..
  • ఆస్ట్రేలియా గతేడాది కోర్సు ఆధారంగా క్లాస్‌ల వారీగా వీసా దరఖాస్తు పద్ధతికి స్వస్తి పలికింది. మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సుల ఔత్సాహికులు సబ్ క్లాస్-500 కేటగిరీలో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే విధానాన్ని రూపొందించింది. ఈ మార్పు మన విద్యార్థులకు కొంత అనుకూలంగా మారింది.
  • పరిశోధనా దృక్పథం, ఎంప్లాయిమెంట్ లింకేజీ ఆధారిత, సబ్జెక్‌పై లోతైన పరిజ్ఞానం ఆస్ట్రేలియా విద్య ప్రత్యేకత.
  • కోర్సు తర్వాత ఏడాది పాటు ఉద్యోగాన్వేషణకు అవకాశం కల్పించడం, ఆ సమయంలో ఉద్యోగం దొరికితే అక్కడే కొనసాగే విధానాలు కూడా ఆస్ట్రేలియా వైపు మొగ్గుచూపేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.
  • అకడమిక్ సెషన్ ప్రారంభం : ఫిబ్రవరి, జూలై నెలలు
పాపులర్ కోర్సులు...
  • అగ్రికల్చర్, డెయిరీ టెక్నాలజీ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్
  • బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్
  • ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
ఉత్తమ విశ్వవిద్యాలయాలు...
1. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ
2. యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్
3. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ
4. అడిలైడ్ యూనివర్సిటీ
5. మొనాష్ యూనివర్సిటీ
6. యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్
7. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్
8. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.immi.gov.au

కెనడా..
  • ఓవైపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేస్తుంటే.. పొరుగునే ఉన్న కెనడా మాత్రం విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు సరళీకృతం చేసింది. సింప్లిఫైడ్ వీసా ఫ్రేమ్ వర్క్ విధానానికి శ్రీకారం చుట్టింది.
  • కెనడా విశ్వవిద్యాలయాలకు హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఏవియేషన్ టెక్నాలజీ, ఆస్ట్రానమీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది.
  • కెనడా కొత్త వర్క్ పర్మిట్, ఇమిగ్రేషన్ విధానం ప్రకారం- కోర్సు పూర్తయిన తర్వాత ఏడాది పాటు అక్కడే ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఈ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే స్పాన్సర్‌షిప్ లెటర్ ఆధారంగా వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడేళ్ల పని అనుభవం తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీకి కూడా దరఖాస్తు చేసుకునే వీలుంది.
  • అకడమిక్ సెషన్ ప్రారంభం: సెప్టెంబర్, జనవరి నెలలు
పాపులర్ కోర్సులు..
  • బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  • హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్
  • లైఫ్ సెన్సైస్, ఇంజనీరింగ్ కోర్సులు
ఉత్తమ విశ్వవిద్యాలయాలు..
  • మెక్‌గిల్ యూనివర్సిటీ
  • క్వీన్స్ యూనివర్సిటీ
  • యూనివర్సిటీ ఆఫ్ టొరంటో
  • వాటర్‌లూ యూనివర్సిటీ
  • యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా
  • యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా
  • యూనివర్సిటీ డి మాంట్రియల్
  • మెక్‌మాస్టర్ యూనివర్సిటీ
  • వెస్ట్రన్ యూనివర్సిటీ
  • యూనివర్సిటీ ఆఫ్ కల్గెరీ
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://www.cic.gc.ca/english/ , https://www.4icu.org/ca/

న్యూజిలాండ్...
  • ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలపరంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే కొంత తక్కువగా ఉండటం న్యూజిలాండ్ ప్రత్యేకత. దీంతో భారత విద్యార్థులకు అప్ కమింగ్ డెస్టినేషన్‌గా నిలుస్తోందీ దేశం.
  • న్యూజిలాండ్ ప్రధానంగా అగ్రికల్చర్, డెయిరీ టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులకు కేరాఫ్‌గా మారుతోంది. వీటితోపాటు హెల్త్ కేర్, ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులనూ అందిస్తోంది.
  • కోర్సులు పూర్తయిన తర్వాత ఏడాది కాలపరిమితితో జాబ్ సెర్చ్ వీసాను అందించే విధానాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. అభ్యర్థులు ఏడాది పాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఆ సమయంలో ఉద్యోగం సొంతం చేసుకుంటే వర్క్ పర్మిట్ లభిస్తుంది.
  • అకడమిక్ సెషన్ ప్రారంభం : మార్చి నెల. అంతకుముందు సంవత్సరం ఆగస్టులోనే ఈ ప్రక్రియకు సన్నద్ధత ప్రారంభించాల్సి ఉంటుంది.
పాపులర్ కోర్సులు..
  • డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్
  • బిజినెస్ మేనేజ్‌మెంట్
  • ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఉత్తమ విశ్వవిద్యాలయాలు
1. యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్
2. యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో
3. యూనివర్సిటీ ఆఫ్ కాంటెర్‌బరీ
4. విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్
5. మాసే యూనివర్సిటీ
6. వ్యకాటో యూనివర్సిటీ
7. లింకన్ యూనివర్సిటీ
8. ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.immigration.govt.nz

జర్మనీ..
  • భవిష్యత్తులో పరిశోధన దిశగా అడుగులు వేయాలనుకునేవారికి కేరాఫ్‌గా నిలుస్తున్న దేశం.. జర్మనీ. ముఖ్యంగా ఆటోమొబైల్, మాన్యుఫ్యాక్చరింగ్ విభాగాల్లో ఎంఎస్ బై రీసెర్చ్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు మన విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ఇంజనీరింగ్ సెన్సైస్, మ్యాథమెటిక్స్, ఐటీ, నేచురల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్ కోర్సులను అందించడంలో జర్మనీ విశ్వవిద్యాలయాలకు మంచి పేరుంది.
  • జర్మనీలో ఉన్నత విద్య పరంగా అధిక శాతం యూనివర్సిటీలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటం.. నామమాత్ర ఫీజులు భారత విద్యార్థులకు అనుకూల అంశం. ప్రైవేటు వర్సిటీల్లో మాత్రం ఫీజులు కాస్త ఎక్కువగానే ఉంటాయి.
  • జర్మనీలో విదేశీ విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక 18 నెలలపాటు ఆ దేశంలో ఉద్యోగాన్వేషణ సాగించే విధంగా సరళీకృత ఇమిగ్రేషన్ విధానం అమలవుతోంది.
  • అకడమిక్ సెషన్ ప్రారంభం : జనవరి, జూలై నెలలు.
పాపులర్ కోర్సులు...
  • పాపులర్ కోర్సులు
  • మ్యాథమెటిక్స్, ఐటీ
  • నేచురల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్
ఉత్తమ విశ్వవిద్యాలయాలు..
1. హంబోల్ట్ యూనివర్సిటీ
2. ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్
3. టెక్నికల్ యూనివర్సిటీ మ్యూనిచ్
4. జార్జ్ అగస్ట్ యూనివర్సిటీ
5. ఎబర్‌హార్డ్ కార్ల్స్ యూనివర్సిటీ
6. టెక్నికల్ యూనివర్సిటీ బెర్లిన్
7. లీప్‌జిగ్ యూనివర్సిటీ
8. జెనా యూనివర్సిటీ
9. బ్రెమెన్ యూనివర్సిటీ
10. రెగెన్స్‌బర్గ్ యూనివర్సిటీ

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.studyin.de/en

సింగపూర్ ..
  • సింగపూర్ యూనివర్సిటీలు.. అమెరికా, యూకేల విద్యా సంస్థలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. ఫలితంగా కోర్సు పూర్తయ్యేసరికి రెండు దేశాలకు చెందిన యూనివర్సిటీల సర్టిఫికెట్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.
  • సింగపూర్ వర్సిటీలు బిజినెస్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, అకౌంటింగ్, ఫైనాన్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హెల్‌్నకేర్ కోర్సులు అందించడంలో ఉత్తమంగా నిలుస్తున్నాయి.
  • పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాలపరంగా ఇటీవల సింగపూర్ ప్రభుత్వం నిబంధనలను కొంత కఠినం చేసింది. అభ్యర్థులు కోర్సు పూర్తయ్యే సమయానికి ఉద్యోగం సొంతం చేసుకుంటేనే ఎంప్లాయ్‌మెంట్ పాస్ అందజేస్తోంది.
  • అకడమిక్ సెషన్ ప్రారంభం : మార్చి, జూలై నెలలు.
పాపులర్ కోర్సులు...
  • బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్
  • టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్
  • అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్
ఉత్తమ విశ్వవిద్యాలయాలు..
1. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్
2. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ
3. ఇన్‌సీడ్ బిజినెస్ స్కూల్
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.singaporeedu.gov.sg

జపాన్..
  • సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులకు పేరుగాంచిన యూనివర్సిటీలున్న దేశం జపాన్. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏవియేషన్ టెక్నాలజీ వంటి కోర్సులు అందించడంలోనూ ఇవి పాపులర్.
  • పోస్ట్ స్టడీ వర్క్ వీసా జారీ పరంగా అభ్యర్థులు తాము కోర్సు పూర్తి చేసుకునే సమయానికే ఉద్యోగం ఖరారు చేసుకోవాలి. ఇందుకోసం.. రెండేళ్ల కోర్సులో చేరిన అభ్యర్థులు మొదటి ఏడాది పూర్తవగానే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి సంస్థలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అకడమిక్ సెషన్ ప్రారంభం : ఏప్రిల్ నెల. కొన్ని వర్సిటీలు మాత్రం అక్టోబర్‌లో సైతం ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తాయి.
పాపులర్ కోర్సులు..
  • ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్
  • ఏవియేషన్ టెక్నాలజీ
ఉత్తమ విశ్వవిద్యాలయాలు...
1. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో
2. క్యోటో యూనివర్సిటీ
3. ఒసాకా యూనివర్సిటీ
4. టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
5. నగోయా యూనివర్సిటీ
6. క్యుషు యూనివర్సిటీ
7. వసెడా యూనివర్సిటీ
8. కోబ్ యూనివర్సిటీ
9. టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ
10. టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.jasso.go.jp

నెదర్లాండ్స్..
  • ఇంజనీరింగ్, ఐటీ కోర్సులకు కేరాఫ్‌గా నెదర్లాండ్స్‌ను పేర్కొనొచ్చు. యూనివర్సిటీస్ ఆఫ్ అప్లైడ్ సెన్సైస్ విధానంలో ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, మేనేజ్‌మెంట్ కోర్సులు కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి.
  • పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాల కోణంలో.. మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు హైలీ స్కిల్డ్ కేటగిరీలో కోర్సు పూర్తయ్యాక ఏడాది పాటు అక్కడే ఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఈ సమయంలో ఉద్యోగం లభిస్తే తొలుత మూడేళ్ల కాల పరిమితి వర్క్ వీసా మంజూరు చేస్తారు.
  • అకడమిక్ సెషన్ ప్రారంభం: సెప్టెంబర్ లేదా ఫిబ్రవరి నెలలు
పాపులర్ కోర్సులు...
  • ఇంజనీరింగ్, ఐటీ
  • ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్
  • మేనేజ్‌మెంట్ కోర్సులు
ఉత్తమవిశ్వవిద్యాలయాలు...
 1. యూనివర్సిటీ ఆఫ్ ఆమ్‌స్టర్‌డ్యామ్ 
 2. డెల్ఫ్ట్‌యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ
 3. ఉట్రెక్ట్ యూనివర్సిటీ 
 4. లీడెన్ యూనివర్సిటీ 
 5. యూనివర్సిటీ ఆఫ్ గ్రొనిన్‌గెన్
 6. ఈన్‌ధోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ 
 7. ఎరాస్‌మస్ యూనివర్సిటీ ఆఫ్ రోటర్‌డ్యామ్
 8. వెజెనిన్‌జెన్ యూనివర్సిటీ 
 9. మాస్ట్రిచ్ట్ యూనివర్సిటీ 
 10.  రాబ్‌బౌడ్ యూనివర్సిటీ  
 పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
 వెబ్‌సైట్: www.nesoindia.org www.studyinholland.nl
Published date : 04 Sep 2017 01:00PM

Photo Stories