Study Abroad: విదేశాల్లో చదువుపై ట్రిపుల్ ఐటీతో ఒప్పందం
నూజివీడు: ట్రిపుల్ ఐటీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి ఇప్పటి నుంచే అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో నూజివీడు ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌కు చెందిన డీజీరేఖ కన్సెల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. దీనిలో భాగంగా డీజీరేఖ కంపెనీ డైరెక్టర్ చాడ జగదీష్‌రెడ్డి, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం మూడేళ్ల పాటు ఉచితంగా జీఆర్‌ఈ, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్‌లకు సిద్ధమయ్యేలా ప్రత్యేక తర్ఫీదును డీజీరేఖ కంపెనీ ఇస్తుందన్నారు. దీని వల్ల విదేశాల్లో ఉన్న యూనివర్సిటీలు, అక్కడ ఉన్న వాటిల్లో నాణ్యమైన విద్యనందించేవి ఏవీ, వాటిల్లో ఎలా అడ్మిషన్లు పొందాలి తదితర అంశాలపైనా అవగాహన కల్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రీసెర్చ్ హెడ్ ఆచార్య జీ మోహన్‌రెడ్డి, ఏవో ప్రదీప్, డీన్ అకడమిక్స్ లక్ష్మణరావు, హైయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ ఇన్‌చార్జి ఎ.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Study Abroad: వీసా తిరస్కరణకు ముఖ్యమైన కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు