Paul Dhinakaran: కారుణ్య వర్సిటీ–ఈటీఎస్ మధ్య ఒప్పందం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కారుణ్య డీమ్డ్ యూనివర్సిటీ.. ఈటీఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
ఈమేరకు డిసెంబర్ 19న మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా ఈటీఎస్ కారుణ్య క్యాంపస్‌కు డిజిటల్ ల్యాబ్‌ను స్పాన్సర్ చేసింది. అలాగే విద్యార్థులకు టోఫెల్, జీఆర్‌ఈ వంటి మాక్ టెస్టులను నిర్వహిస్తుంది.
చదవండి: Australia Says No To TOEFL: ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటున్నారా... ఇక టోఫెల్ కి చెక్!
ఆంగ్ల భాషలో ప్రావీణ్యంపై దృష్టి సారించే వర్క్‌షాప్‌లతో సహా ప్రత్యేక జీఆర్‌ఈ, టోఫెల్ మాస్టర్ క్లాస్‌లను కూడా నిర్వహించనుంది. అలాగే ఈ ఒప్పందం ద్వారా ఈటీఎస్ రిసోర్స్ సెంటర్ నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు, ఒలింపియాడ్స్‌లో కారుణ్య వర్సిటీ విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. ఈ ఒప్పందం అంతర్జాతీయ వర్సిటీల్లో అడ్మిషన్లు కోరుకునే విద్యార్థులకు పలు మార్గాలను సూచిస్తుందని వర్సిటీ చాన్స్‌లర్ పాల్ దినకరన్ పేర్కొన్నారు.
Published date : 20 Dec 2023 12:38PM