TS Paramedical Jobs : నేడే పారామెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ఎంపికైతే రూ.30000 జీతం..
Sakshi Education
తెలంగాణలో పారామెడికల్ ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెల మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ద్వారా నియామకాలు చేపడతారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపట్టనున్నారు.
డిసెంబరు 1న నోటిఫికేషన్ ?
డిసెంబరు 1వ తేదీన జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఒక వేళ డిసెంబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తే.. డిసెంబర్ 5వ తేదీ నుంచే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అలాగే డిసెంబర్ 7వ తేదీన మెరిట్ జాబితా ముసాయిదా విడుదల చేసి మరుసటి రోజు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.వాటిని పరిష్కరించి పదో తేదీన తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
నెలకు రూ.30వేల జీతంతో..
పారామెడికల్ ఆప్తమాలిక్ ఆఫీసర్లకు నెలకు రూ.30వేల వేతనం ఇస్తారు. కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1491 వైద్య బృందాలు ఏర్పాటుచేయనున్నారు.
Published date : 01 Dec 2022 02:06PM