Skip to main content

Breaking News: 80,039 ఉద్యోగాల‌కు నేటి నుంచే నోటిఫికేషన్లు.. అత్యధికంగా ఈ శాఖ‌లోనే ఉద్యోగాలు..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక ప్రకటన చేశారు. ఊహించినట్లుగానే భారీగా కొలువుల భర్తీ ప్రకటనను స్వయంగా వెల్లడించారు.
telangana cm k chandrashekar rao
telangana cm k chandrashekar rao

మొత్తం 91, 142 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అని ప్రకటించారు. తమది ఎంప్లాయింట్‌మెంట్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని, హయ్యెస్ట్‌ పెయిడ్‌ ఎంప్లాయిస్‌ తెలంగాణలో ఉన్నారని ప్రకటించుకున్న తెలంగాణ సీఎం.. కేంద్రం వైఖరి వల్లే భర్తీ ప్రక్రియ ఆలస్యమైందని ఆరోపించారు.

లక్షా 56 వేల ఉద్యోగాలు నోటిఫై చేశాం..
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఉద్దేశంతో పోరాడాం. గోదావరి జలాలు సాధించుకున్నాం. తెలంగాణ కోసం విద్యార్థులు పోరాటాలు చేశారు. రెండు రోజులు ఆలస్యమైనా పని మంచిగా జరగాలనే కోణంలో పని చేసింది మా ప్రభుత్వం. ఇప్పటివరకు లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.  మరో లక్షా 56 వేల ఉద్యోగాలకు నోటిఫై చేశాం. రాష్ట్రపతి, ప్రధానులకు స్వయంగా నేనే చర్చించా. దేశంలో ఎక్కడా లేని విధంగా.. శాశ్వతంగా 95 శాతం స్థానికులకే వచ్చేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇకపై అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకే. టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాం. 9, 10 షెడ్యూల్‌ పంచాయితీ ఇంకా తెగని కారణంగా.. మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. 

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తెలంగాణలో గుర్తించిన ఖాళీలు : 91,142

➤ 11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రైగ్యులరైజేషన్‌

➤ గ్రూప్‌-1 పోస్టులు:  503

➤ గ్రూప్‌-2 పోస్టులు : 582

➤ గ్రూప్‌-3 పోస్టులు: 1,373

➤ గ్రూప్‌-4 పోస్టులు : 9,168  

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ స్ట‌డీమెటీరియ‌ల్ కోసం క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష‌ల ఆన్‌లైన్ టెస్టుల కోసం క్లిక్ చేయండి

➤ జిల్లా స్థాయిల : 39, 829 పోస్టులు.
➤ హైదారాబాద్‌ ☛  5,268
➤ నిజామాబాద్‌ ☛  1,976 
➤ మేడ్చల్‌ మల్కజ్‌గిరి ☛ 1,769
➤ రంగారెడ్డి ☛ 1,561
➤ కరీంనగర్‌ ☛ 1,465
➤ నల్లగొండ  ☛1,398
➤ కామారెడ్డి ☛ 1,340
➤ ఖమ్మం ☛ 1,340
➤ భద్రాద్రి కొత్తగూడెం☛ 1,316
➤ నాగర్‌ కర్నూలు☛1,257
➤ సంగారెడ్డి☛1,243
➤ మహబూబ్‌నగర్‌☛ 1,213
➤ ఆదిలాబాద్‌☛ 1,193
➤ సిద్దిపేట☛ 1,178
➤ మహబూబాబాద్‌☛ 1, 172
➤ హన్మకొండ ☛ 1,157
➤ మెదక్‌ ☛ 1,149
➤ జగిత్యాల☛ 1, 063
➤ మంచిర్యాల ☛ 1, 025
➤ యాదాద్రి-భువనగిరి☛ 1,010 
➤ జయశంకర్‌ భూపాలపల్లి ☛ 918
➤ నిర్మల్‌ ☛876
➤ వరంగల్‌ ☛842
➤ కొమురంభీం ఆసీఫాబాద్‌ ☛ 825
➤ పెద్దపల్లి ☛800
➤జనగాం ☛760
➤ నారాయణ్‌పేట ☛ 741
➤వికారాబాద్‌ ☛738
➤ సూర్యాపేట ☛719
➤ ములుగు ☛ 696
➤ జోగులాంబ గద్వాల ☛ 662
➤ రాజన్న సిరిసిల్ల ☛ 601
➤ వనపర్తి ☛556

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప్రీవియ‌స్‌పేప‌ర్స్‌ కోసం క్లిక్ చేయండి

☛ జోనల్‌ లెవల్‌లో 18, 866 పోస్టులు

☛ మల్టీజోనల్‌లో 13, 170 ఉద్యోగాల ఖాళీ

☛ ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8, 174 పోస్టులు..

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

80,039 పోస్టులకు నుంచే నోటిఫికేషన్లు..
నిరుద్యోగుల జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో.. 11, 103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్‌. అలాగే మిగిలిన వాటిల్లో  80,039 పోస్టులకు ఇవాళ్టి(మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. అంతేకాదు ఉద్యోగ గరిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు.

పోటీప‌రీక్ష‌ల బిట్స్‌ కోసం క్లిక్ చేయండి

అత్యధికంగా హోం శాఖలోనే..
మొత్తం 80,039 ఖాళీల్లో..  అత్యధికంగా హోం శాఖలో 18,334 ఖాళీలు ఉన్నాయి. తర్వాతి  సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086 ఖాళీలు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో 12,775 ఖాళీలు ఉన్నాయి. 

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

అత్యల్పంగా ఈ శాఖ‌లోనే..
ఉన్నత విద్యలో 7, 878, బీసీల సంక్షేమం 4, 311, రెవెన్యూలో 3, 560, షెడ్యూల్‌ కాస్ట్స్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో 2, 879, ఇరిగేషన్‌లో 2, 692, ఫైనాన్స్‌లో 1, 146, అత్యల్పంగా లెజిస్లేచర్‌లో 25, విద్యుత్‌ శాఖలో 16 ఖాళీలు ఉన్నాయి. 

కాంట్రాక్ట్ ఉద్యోగులే..
కాంట్రాక్ట్ ఉద్యోగాలు వద్దన్నందుకు రాష్ట్రంలోని పలు పార్టీలు కోర్టుకు వెళ్లాయని చెప్పారు సీఎం కేసీఆర్‌. ఉద్యోగి కన్నా కాంట్రాక్ట్ ఉద్యోగులే ఎక్కువ పనిచేస్తుంటార‌ని, అయినప్ప‌టికీ వారి జీతాలు మాత్రం తక్కువగా ఉంటున్నాయ‌ని చెప్పారు.కాంట్రాక్ట్ పేరుతో శ్రమదోపిడి ఉండకూడ‌ద‌నేది త‌మ‌ అభిలాష అని ఆయన అన్నారు. అందుకే 11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యుల‌రైజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇక ఉద్యోగ క్యాలెండర్ విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. క్ర‌మంగా ఉద్యోగాల భ‌ర్తీ ఉంటుంద‌ని చెప్పారు. 

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స‌మ‌గ్ర స‌మాచారం కోసం క్లిక్ చేయండి

1.12 లక్షల కొత్త పోస్టులు..
రాష్ట్రంలో ఇప్ప‌టికే తాము 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామ‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు.

వ‌యోప‌రిమితి ఇలా..
☞ ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
☞ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
☞ దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
☞ ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
☞ హోంశాఖలో వయోపరిమితి మినహాయింపు లేదు

Group 1 Ranker: ఆన్‌లైన్‌ కోచింగ్‌..గ్రూప్‌–1 ఉద్యోగం

Y.Obulesh, Group 1 Ranker : ప్ర‌భుత్వ స్కూల్‌లో చ‌దివా...ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

​​​​​​​Success Story: ఫ‌స్ట్ ర్యాంక్ సాధించా .. ఆర్‌టీఓగా ఉద్యోగం కొట్టా..

DSP Snehitha : గ్రూప్‌–1కు సెలక్టయ్యానిలా...ముగ్గురం ఆడపిల్లలమే..అయినా

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

Group-2 Job:మొదటి ప్రయత్నంలోనే విజయం..గ్రూపు–2లో ఉద్యోగం..ఎలా అంటే..

గ్రూప్‌–1 కిరీటం.. రాష్ట్రస్థాయిలో ఫ‌స్ట్ ర్యాంక్‌.. ఆర్‌టీఓగా ఉద్యోగం

కూలీ ప‌నిచేస్తూ..ఎక్సైజ్‌ ఎస్సై ఉద్యోగం కొట్టానిలా..

Success Story: ఈ పరిస్థితులే.. న‌న్ను నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేశాయ్‌..

Published date : 09 Mar 2022 01:28PM

Photo Stories