TET Exams 2023: టెట్ పరీక్షలు మొదలు... ఎప్పుడు?
సాక్షి ఎడ్యుకేషన్: ఈనెల 15న టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అధికారులకు సూచించారు. నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్‌లో టెట్ నిర్వహణపై జిల్లా పంచాయతీ, విద్య, మిషన్ భగీరథ, విద్యుత్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Teacher's Day: గురువుల గురించి గొప్పగా వర్ణించారు
ఈనెల 15న ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మద్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుందని వివరించారు. జిల్లాలో 7,837 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. వారి కోసం 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని సూచించారు. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలని తెలిపారు.