TSRTC: ‘కారుణ్యం’ ద్వారా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సంబంధించి ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టులకు గతంలో జరిగిన నియామక పరీక్షలకు సంబంధించి పీఈటీ విభాగంలో విఫలమైన వారికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో అవకాశం కల్పించారు.
‘కారుణ్యం’ ద్వారా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ
పీఈటీ విభాగంలో కొన్ని అంశాల్లో అభ్యర్థులు విఫలమయ్యారు. దీంతో తమకు మరో అవకాశం కల్పిస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటామని పలువురు విన్నవించారు. దీంతో సజ్జనార్ సానుకూలంగా స్పందించి అందుకు ఆమోదం తెలిపారు. 40 ఏళ్ల లోపు అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని, ఎంపిక ప్రక్రియ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.