Skip to main content

Professor Jobs: వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుల స్వీకరణ చివ‌రి తేదీ ఇదే

ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వర్తించేందుకు 68 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, నాలుగు సీఎఎస్‌ ఆర్‌ఎంఓ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.
Invitation of applications for medical posts

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు, సీఎఎన్‌ ఆర్‌ఎంఓకు రూ.52 వేలు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. పోస్టుల జాబితా కళాశాల వెబ్‌సైట్‌ http:/www.kmc wgl.comలో పొందుపర్చినట్లు తెలిపారు.

చదవండి: Jobs In Medical College: మెడికల్‌ కాలేజీలో పోస్టులు.. 19 మంది నియామకం

వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. దరఖాస్తులు 27వ తేదీ నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వీకరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 26 Sep 2024 05:26PM

Photo Stories