Skip to main content

DSC 1998: అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘డీఎస్సీ–98’ పరీక్షల్లో అర్హత సాధించినా ఉద్యోగాలు పొందని వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మినిమమ్‌ టైమ్‌ స్కేలుపై ఎస్జీటీలుగా నియామక ఉత్తర్వులు అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది.
DSC 1998
డీఎస్సీ–98 అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

ఇప్పటికే అభ్యర్థుల గుర్తింపు, ఆసక్తి వ్యక్తీకరణపత్రాల స్వీకరణ, సర్టిఫికెట్ల పరిశీలనను దశలవారీగా అధికారులు పూర్తిచేశారు. అభ్యర్థుల తుది జాబితాలను సిద్ధం చేసి ఆయా జిల్లా విద్యాధికారి కార్యాలయ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. తుది జాబితాల్లో ఉన్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 12, 13న డీఈవో కార్యాలయాల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

చదవండి: AP DSC Notification 2023 : డీఎస్సీ నోటిఫికేష‌న్ పై మంత్రి బొత్స కీలక ప్ర‌క‌ట‌న ఇదే.. ఈ సారి మాత్రం..

అన్ని పరిశీలనల అనంతరం వీరికి మినిమమ్‌ టైమ్‌ స్కేలుపై ఎస్జీటీలుగా నియామక ఉత్తర్వులు అందిస్తారు. అయితే, అభ్యర్థులు జ్యుడిషియరీ అగ్రిమెంట్‌ బాండ్‌ను సమర్పించిన తర్వాతే నియామక ఉత్తర్వులు అందజేస్తారు. అభ్యర్థుల నుంచి డిక్లరేషన్‌ ఫారం, ఆప్షన్‌ ఫారం కూడా అధికారులు తీసుకుంటారు. కాగా టీచర్ల నియామకంలో రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మనోజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కల్లగుంట మోహన్‌ రావు ఓ ప్రకటనలో కోరారు.

చదవండి: AP News: డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్‌... ఈ నెలాఖ‌రుకి ఆఫ‌ర్ లెటర్లు

Published date : 12 Apr 2023 03:14PM

Photo Stories