ఉన్నత కెరీర్‌కు...ఢిల్లీ పోలీసు, సీఏపీఎఫ్‌ఎస్ ఉద్యోగాలు
Sakshi Education
కేంద్ర సాయుధ బలగాలు, ఢిల్లీ పోలీస్ శాఖలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 1223 ఎస్‌ఐ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
సీఐఎస్‌ఎఫ్‌లోని ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఖాళీలను తర్వాత వెల్లడిస్తారు. ఈ ఉద్యోగాలను పొందడం ద్వారా దేశసేవ చేసే అవకాశంతోపాటు ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకునేందుకు వీలవుతుంది. రూ.50 వేలకు తక్కువ కాకుండా వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ గెడైన్స్..
భర్తీచేసే ఉద్యోగాలు..
పురుష అభ్యర్థులకు..
పోస్టుల భర్తీలో భాగంగా కంప్యూటర్ ఆధారిత టెస్టులు, దేహ దారుఢ్య పరీక్షలు, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. మొదట ఆన్‌లైన్‌లో పేపర్-1 పరీక్ష ఉంటుంది. ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారికి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టులు/ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు (పీఎస్‌టీ) ఉంటాయి. ఇందులోనూ అర్హత సాధిస్తే మరో కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్-2 ఉంటుంది. పేపర్-1, 2లో పొందే మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్టులు ఉంటాయి. ఈ దశలు దాటిన తర్వాత మెరిట్ జాబితా ప్రాతిపదికన, అభ్యర్థుల ప్రాధాన్యాల మేరకు డిపార్ట్‌మెంట్ కేటాయిస్తారు.
వేతనాలు:
గ్రూప్-బీ, సీ విభాగాలకు చెందిన ఈ పోస్టులకు ఎంపికైతే మంచి వేతనాలు లభిస్తాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు లెవెల్-6 పేస్కేలు ప్రకారం- రూ.35,400-రూ.1,12,400 వేతనం అందుతుంది. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు లెవెల్-5 పేస్కేలు ప్రకారం- రూ.29,200-రూ.92,300 వేతనం ఉంటుంది. ఇతర అలవెన్సులూ ఇస్తారు.
సన్నద్ధత..
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2018.
దరఖాస్తు రుసుం: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
పేపర్ 1 పరీక్ష తేదీలు: 2018, జూన్ 4 నుంచి జూన్ 10 వరకు.
పేపర్ 2 పరీక్ష: 2018, డిసెంబర్ 1.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ssc.nic.in
భర్తీచేసే ఉద్యోగాలు..
- ఢిల్లీ పోలీస్ విభాగంలో పురుషులకు 97, మహిళలకు 53 ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి.
- సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌ఎస్) విభాగంలో పురుషులకు 1035, మహిళలకు 38 ఎస్‌ఐ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
- సెంట్రల్ ఆర్‌మడ్ పోలీస్ ఫోర్సెస్‌లో సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ ఉంటాయి.
- ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018, ఆగస్టు 1 నాటికి డిగ్రీ పూర్తి చేయబోయే వారూ అర్హులే. వీటితోపాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
- 2018, ఆగస్టు 1 నాటికి వయసు 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంది. ఢిల్లీ పోలీస్‌లోని ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థులకు డ్రైవింగ్ లెసైన్స్ (లైట్ మోటార్ వెహికల్) తప్పనిసరి.
- ఎస్టీ పురుషులకు: ఎత్తు- 162.5 సెం.మీ., ఛాతీ-77 సెం.మీ, గాలి పీల్చినప్పుడు- 82 సెం.మీ.
- ఇతర కేటగిరీల పురుషులకు: ఎత్తు- 170 సెం.మీ., ఛాతీ- 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు- 85 సెం.మీ.
- ఎస్టీ మహిళలకు: ఎత్తు 154 సెం.మీ. ఉండాలి.
- ఇతర కేటగిరీల మహిళలకు: ఎత్తు 157 సెం.మీ. ఉండాలి.
- బరువు: ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
పురుష అభ్యర్థులకు..
- 16 సెకన్లలో 100 మీటర్ల పరుగు.
- 6.5 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగు.
- లాంగ్‌జంప్-3.65 మీటర్లు (మూడు అవకాశాల్లో).
- హైజంప్-1.2 మీటర్లు (మాడు అవకాశాల్లో)
- షాట్‌పుట్ (16 ఎల్‌బీఎస్)- 4.5 మీటర్లు (మూడు అవకాశాల్లో).
- 18 సెకన్లలో 100 మీటర్లు పరుగు.
- 4 నిమిషాల్లో 800 మీటర్లు.
- లాంగ్‌జంప్-2.7 మీటర్లు (మూడు అవకాశాల్లో).
- హైజంప్- 0.9 మీటరు్ల(మాడు అవకాశాల్లో).
పోస్టుల భర్తీలో భాగంగా కంప్యూటర్ ఆధారిత టెస్టులు, దేహ దారుఢ్య పరీక్షలు, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. మొదట ఆన్‌లైన్‌లో పేపర్-1 పరీక్ష ఉంటుంది. ఇందులో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారికి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్టులు/ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు (పీఎస్‌టీ) ఉంటాయి. ఇందులోనూ అర్హత సాధిస్తే మరో కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్-2 ఉంటుంది. పేపర్-1, 2లో పొందే మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన, మెడికల్ టెస్టులు ఉంటాయి. ఈ దశలు దాటిన తర్వాత మెరిట్ జాబితా ప్రాతిపదికన, అభ్యర్థుల ప్రాధాన్యాల మేరకు డిపార్ట్‌మెంట్ కేటాయిస్తారు.
వేతనాలు:
గ్రూప్-బీ, సీ విభాగాలకు చెందిన ఈ పోస్టులకు ఎంపికైతే మంచి వేతనాలు లభిస్తాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు లెవెల్-6 పేస్కేలు ప్రకారం- రూ.35,400-రూ.1,12,400 వేతనం అందుతుంది. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు లెవెల్-5 పేస్కేలు ప్రకారం- రూ.29,200-రూ.92,300 వేతనం ఉంటుంది. ఇతర అలవెన్సులూ ఇస్తారు.
సన్నద్ధత..
- కంప్యూటర్ ఆధారిత పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపరుకు 200 మార్కులు. పేపర్-1లో 50 మార్కులు ఇంగ్లిష్‌కు కేటాయించారు. పేపర్-2లో పూర్తిగా ఇంగ్లిష్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంగ్లిష్ సెక్షన్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి.
- పేపర్-1లో ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్‌తోపాటు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్‌జ-జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 2 గంటలు. పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్-కాంప్రెహెన్షన్ నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష సమయం 2 గంటలు. పేపర్-1, 2లలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు కోత విధిస్తారు.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్: వొకాబ్యులరీ, గ్రామర్, రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాలకు సమ ప్రాధాన్యం లభిస్తుంది. పరీక్ష ముఖ్య ఉద్దేశం.. ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోవడం, బేసిక్ రైటింగ్ స్కిల్స్‌ను పరీక్షించడం. పేపర్-1, 2ల సిలబస్ ఒకేలా ఉంటుంది. రీడింగ్ కాంప్రెహెన్షన్ (ఆర్‌సీ)లో నీతి కథలు, ఎకానమీ, ఆర్థిక సంబంధ ఎస్సేలు, సామాజిక సమస్యలపై ప్యాసేజీలు వస్తున్నాయి. ఇవి అభ్యర్థి ఇంగ్లిష్ భాషను ఏ మేరకు అర్థం చేసుకుంటున్నాడు, క్రిటికల్‌గా ఇచ్చిన సమాచారాన్ని ఎలా విశ్లేషించుకోగలుగుతున్నాడు తదితర అంశాలను పరీక్షించేలా ఉంటాయి. ఆర్‌సీలో రాణించడానికి రీడింగ్ స్కిల్స్ అలవరచుకోవాలి. రోజూ ఏదైనా ఒక ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రికను చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. వొకాబ్యులరీ పరంగా సినానిమ్స్, ఆంటోనమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్ తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ఎక్కువగా దృష్టిసారించాల్సిన ముఖ్యమైన విభాగం గ్రామర్. స్పాటింగ్ ద ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, సెంటెన్స్ అరేంజ్‌మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, డెరైక్ట్/ఇన్‌డెరైక్ట్ స్పీచ్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గ్రామర్ రూల్స్ తెలుసుకొని, వాటి అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. వొకాబ్యులరీ పార్ట్‌పై పట్టు సాధించేందుకు కృషిచేయాలి.
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: ఈ విభాగంలో వెర్బల్, నాన్ వెర్బల్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. ప్రశ్నల క్లిష్టత స్థాయి సులువుగా ఉంటుంది. దీనిలో సిరీస్ (నంబర్/ఆల్ఫా న్యూమరిక్) విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడానికి ఆస్కారముంది. అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాయిజమ్, మాట్రిక్స్, దిశలు, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్ (వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్, డీకోడింగ్ తదితర అంశాలు అధ్యయనం చేయాలి.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, శాతాలు, త్రికోణమితి, ఆల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ అధ్యాయాలు ముఖ్యమైనవి. అభ్యర్థులు తొలుత బేసిక్స్‌పై పట్టు సాధించాలి. ప్రిపరేషన్ క్రమంలో సులువైన చాప్టర్లతో ప్రారంభించి, కఠినమైన సెక్షన్లకు వెళ్లాలి. ఎస్‌ఎస్‌సీ నిర్వహించే పరీక్షల్లో చాలావరకు గతంలో వచ్చిన తరహాలోనే (మోడల్) ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రీవియస్ పేపర్లను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి.
- జనరల్ అవేర్‌నెస్: ఇందులో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, జనరల్ సైన్స్, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్ విభాగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపరేషన్‌కు ఉపయోగపడతాయి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 2, 2018.
దరఖాస్తు రుసుం: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
పేపర్ 1 పరీక్ష తేదీలు: 2018, జూన్ 4 నుంచి జూన్ 10 వరకు.
పేపర్ 2 పరీక్ష: 2018, డిసెంబర్ 1.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ssc.nic.in
Published date : 10 Mar 2018 02:46PM