Skip to main content

సీజీఎల్‌ఈ టైర్-2 ప్రిపరేషన్ టిప్స్..

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్‌ఈ)- 2017 టైర్-1 పరీక్షలు ముగిశాయి. దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత విధానంలో ఆగస్టు 5 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించారు. దాదాపు 15.44 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. తాజాగా ఎస్‌ఎస్‌సీ.. అభ్యర్థుల సమాధాన పత్రాలను వెబ్‌సైట్లో పొందుపరచింది. టైర్-1లో మంచి ప్రతిభ కనబరిచామనుకొన్న అభ్యర్థులు తర్వాతి దశలైన టైర్-2, 3లకు ప్రిపరేషన్ ప్రారంభించొచ్చు.
గతంలో టైర్-1, 2లలో సాధించిన మార్కుల ఆధారంగా టైర్-3 (నవంబర్‌లో జరిగే)కి అర్హులైన వారిని ఎంపిక చేసేవారు. కానీ, ఈసారి టైర్-2, 3లను ఒకేసారి నిర్వహిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. సీజీఎల్‌ఈ టైర్-1లో ఈసారి కటాఫ్ మార్కులు గతంలో కంటే తగ్గే అవకాశం ఉంది. 2016 సీజీఎల్‌ఈ టైర్-1లో జనరల్ కేటగిరిలో కటాఫ్ మార్కులు 137గా ఉండగా ఈసారి 130గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టైర్-3ను కూడా గంట సమయంలో ‘పెన్ అండ్ పేపర్’ విధానంలో రాయాల్సి ఉంటుంది. హిందీ/ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష రాయవచ్చు. ఇందులో లెటర్ రైటింగ్/ప్రిసైజ్ రైటింగ్/ఎస్సే రైటింగ్/అప్లికేషన్ రైటింగ్ మొదలైనవి ఉంటాయి. ఈ విభాగానికి 100 మార్కులు.

టైర్-2 కు సన్నద్ధత...
ఇప్పటికే అభ్యర్థులు టైర్-1 పరీక్షకు ప్రిపరేషన్‌లో భాగంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ సెక్షన్లకు చదివి ఉంటారు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ టైర్-2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)లో ఈ రెండు సబ్జెక్టులు ఉమ్మడిగా ఉంటాయి. ముందుగా ఆయా సబ్జెక్టుల్లో ఏయే విభాగాల నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకోవాలి. తదనుగుణంగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి.

క్వాంటిటేటివ్ ఎబిలిటీస్...
టైర్-2లో పేపర్-1 ఇది. 100 ప్రశ్నలతో ఉండే ఈ పేపర్లో సాధించే ఒక్కో ప్రశ్న రెండు మార్కులు తెచ్చి పెడుతుంది. రెండు గంటల వ్యవధిలో ఈ పేపర్‌లో మంచి స్కోరు చేయడానికి మ్యాథ్స్, ఆప్టిట్యూడ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ సబ్జెక్ట్‌కు సంబంధించి ప్రశ్నల క్లిష్టత తేలిక, మధ్యస్థ స్థాయిలో ఉంటుంది.
  • అభ్యర్థులు ప్రధానంగా mensuration, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, నంబర్ సిస్టమ్, ట్రిగనోమెట్రీ, రేషియో అండ్ ప్రపోర్షన్, డేటా ఇంటర్‌ప్రిటేషన్; టైం, స్పీడ్, డిస్టెన్స్; టైమ్ అండ్ వర్క్, ఇంట్రెస్ట్, పర్సంటేజెస్, యావరేజెస్, నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. వీటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
  • ఈ సబ్జెక్టులో రాణించాలంటే వేగం, కచ్చితత్వం ప్రధానం. దీనికి ప్రాక్టీస్ ఉపకరిస్తుంది. 2 గంటల వ్యవధిలోనే 100 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయడం మేలు చేస్తుంది.
  • కొన్ని సమస్యలకు పెన్ ఉపయోగించకుండానే సమాధానాలు రాబట్టొచ్చు. అలాంటి ప్రశ్నలకు త్వరగా సమాధానాలు గుర్తించి మిగిలిన వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి. మొదట సులువైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి
  • ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌లో చాలావరకు గతంలో వచ్చిన ప్రశ్నల తరహాలోనే (మోడల్‌లోనే) ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రీవియస్ పేపర్లను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. డేటా ఇంటర్‌ప్రెటేషన్ ప్రశ్నలు తేలిగ్గానే ఉంటాయి. వీటిని కచ్చితంగా అటెంప్ట్ చేయాలి.
  • కొన్ని ప్రశ్నలకు ఆప్షన్ ఎలిమినేషన్ విధానంలో కచ్చితమైన సమాధానాలు గుర్తించొచ్చు. కిరణ్ పబ్లికేషన్స్ చాప్టర్‌వైజ్ సాల్వ్‌డ్ పేపర్లు, ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకాలు ప్రిపరేషన్‌కు ఉపయోగపడతాయి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ :
  1. ఈ సబ్జెక్టు నుంచి 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. 2 గంటల సమయం ఉంటుంది. ఈ విభాగంలో వొకాబ్యులరీ, రీడింగ్ కాంప్రెహెన్షన్, గ్రామర్ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తున్నాయి.
  2. రీడింగ్ కాంప్రెహెన్షన్ (ఆర్‌సీ) నుంచి 25-30 ప్రశ్నల వరకు వస్తాయి. 2-4 ప్యాసేజీలు ఉంటున్నాయి. నీతి కథలు; ఆర్థిక, సామాజిక అంశాలపై ప్యాసేజీలు ఇస్తున్నారు. ఆర్‌సీ ముఖ్య ఉద్దేశం.. అభ్యర్థి ఇంగ్లిష్ భాషను ఏ మేరకు అర్థం చేసుకుంటున్నాడు? ఇచ్చిన సమాచారాన్ని ఎలా విశ్లేషించుకోగలగుతున్నాడు? అని పరిశీలిస్తారు. ఈ విభాగంలో రాణించడానికి రీడింగ్ స్కిల్స్ అలవర్చుకోవాలి. రోజూ ఏదైనా ఒక ప్రామాణిక ఆంగ్ల పత్రికను చదవడం, అందులోని వార్తలను అర్థం చేసుకోవడం, కొత్త పదాలను నేర్చుకోవడం చేయాలి. ఇలాచేస్తే రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో రాణించొచ్చు. రీడింగ్ ప్రాక్టీస్ చేసిన వారికి సమయ పాలన కూడా అలవడుతుంది.
  3. వొకాబ్యులరీ నుంచి 30 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. synonyms, antonyms, idioms and phrases, one word substitution, spelling errors అంశాలపై దృష్టిసారించాలి.
  4. గ్రామర్: టైర్-2 ఇంగ్లిష్‌లో 55 శాతం మార్కులకు కేవలం గ్రామర్ సెక్షన్ నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. స్పాటింగ్ ఎర్రర్స్: 20, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్: 22, సెంటెన్స్ అరెంజ్‌మెంట్: 20, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్: 5, డెరైక్ట్/ఇన్‌డెరైక్ట్ స్పీచ్: 27, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్: 20 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఎక్కువగా గ్రామర్‌పై దృష్టిసారించాలి.
  5. గ్రామర్ రూల్స్ తెలుసుకోవడం, వాటి అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం ద్వారా సెంటెన్స్ కరెక్షన్-సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించొచ్చు.
  6. చాలా ముఖ్యమైన వొకాబ్యులరీ పార్ట్‌పై పట్టు సాధించేందుకు Word Power Made Easy (Norman lewis), 30 DAYS TO A MORE POWERFUL VOCABULARY పుస్తకాలతో పాటు www.vocabulary.com చాలా ఉపయోగపడుతుంది.
  7. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో వచ్చే ప్యాసేజీలను వదిలేయకుండా, అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇవి తేలిగ్గానే ఉంటాయి. ఆందోళన అనవసరం.
వెబ్‌సైట్: www.ssc.nic.in
Published date : 12 Sep 2017 04:44PM

Photo Stories