ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ కేంద్ర కొలువుల వివరాలు.. విజయానికి వ్యూహాలు..
ఉద్యోగాల వివరాలు
గ్రూప్ బి: సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వంటి విభాగాల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు, ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్, సీబీఈసీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), సబ్ ఇన్‌స్పెక్టర్ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్), స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2(స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ).
గ్రూప్ సి: కాగ్,సీజీడీఏ, సీజీఏ తదితరుల పరిధిలోని కార్యాలయాల్లో ఆడిటర్/ఆకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్. వివిధ విభాగాల్లో అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్ (సీబీడీటీ/సీబీఈసీ), కంపైలర్ (రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా), సబ్ ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), డివిజనల్ అకౌంటెంట్ (కాగ్), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఐటీ.
అర్హత:
- కంపైలర్ ఉద్యోగం: ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుగా ఉండే గ్రూప్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
- స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2: 12వ తరగతిలో మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులుండాలి. దీంతోపాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
- ఇతర ఉద్యోగాలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ.
- శారీరక ప్రమాణాలు: ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్/ ఎగ్జామినర్/ ప్రివెంటివ్ ఆఫీసర్/ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఎన్) పోస్టులకు.. ఎత్తు: 157.5 సెం.మీ, ఛాతీ: 81 సెం.మీ. (గాలి పీలిస్తే 5 సెం.మీ. పెరగాలి). మహిళలు-152 సెం.మీ. బరువు: 48 కిలోలు. సీబీఐ-సబ్‌ఇన్‌స్పెక్టర్స్: పురుషులకు ఎత్తు 165 సెం.మీ., ఛాతీ: 76 సెం.మీ; మహిళలకు ఎత్తు 150 సెం.మీ. ఉండాలి.
- 2015, ఆగస్టు 1 నాటికి అసిస్టెంట్ (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్)కు 20-27 ఏళ్లు, అసిస్టెంట్ (ఇంటెలిజెన్స్ బ్యూరో)కు 21-27 ఏళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ)కు 20-30 ఏళ్లు, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2కు గరిష్ట వయసు 32 ఏళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎన్‌ఐఏ)కు గరిష్ట వయసు 30 ఏళ్లు. ఇతర ఉద్యోగాలకు 18-27 ఏళ్లు.
- ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
టైర్-1 పరీక్ష (రెండు గంటలు)
సబ్జెక్టు | ప్రశ్నలు/మార్కులు |
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ | 50 |
జనరల్ అవేర్‌నెస్ | 50 |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 |
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ | 50 |
మొత్తం | 200 |
టైర్-2 (ఒక్కో పేపర్‌కు రెండు గంటలు):
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
పేపర్-1 (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్) | 100 | 200 |
పేపర్-2 (ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రెహెన్షన్) | 200 | 200 |
మొత్తం | 300 | 400 |
- స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకు పేపర్-1, పేపర్-2లతో పాటు పేపర్-3 ఉంటుంది. ఈ మూడో పేపర్‌లో స్టాటిస్టిక్స్‌కు సంబంధించి 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి.
- ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది.
- ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి.
- టైర్-1, టైర్-2 పేపర్-2లకు ప్రతి తప్పు సమాధానాని కి 0.25మార్కులు, టైర్-2 పేపర్-1,పేపర్-3లకు ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.
మూడో దశ: పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. గ్రూప్ బి ఉద్యోగాలు, గ్రూప్-సి (ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్-సీబీడీటీ), గ్రూప్-సి (డివిజనల్ అకౌంటెంట్-కాగ్) ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది.
- కొన్ని పోస్టులకు ఎంపికైన వారికి ప్రొఫిషియన్సీ/స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అసిస్టెంట్(సీఎస్‌ఎస్)కు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ట్యాక్స్ అసిస్టెంట్‌కు డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ (8 వేల కీ డిప్రెషన్స్/గంట) ఉంటుంది.
- ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్/ఎగ్జామినర్/ప్రివెంటివ్ ఆఫీసర్/ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్) పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు.
మూడు దశల్లో ఉంటుంది. అవి.. టైర్-1 పరీక్ష, టైర్-2 పరీక్ష. టైర్-1లో అర్హత సాధించినవారు మాత్రమే టైర్-2 పరీక్ష రాసేందుకు వీలవుతుంది. రెండు పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా మూడో దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ కం ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
ప్రిపరేషన్
జనరల్ ఇంగ్లిష్‌లో అంశాల వారీగా వస్తున్న ప్రశ్నలు:
సమయపాలన కీలకం: మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేసేటప్పుడు టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమైనది. ఈ కింది విధానంలో ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు రావడం ఖాయం.
టైర్ 1+ టైర్ 2 (600 మార్కులు) (ఇంటర్వ్యూ/ఇంటర్వ్యూ లేని పోస్టులకు)
ఎన్.వినయ్‌కుమార్ రెడ్డి, డెరైక్టర్, Indian Academy for Competitive Exams(IACE) |
ముఖ్య సమాచారం
- ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/ఎక్స్-సర్వీస్‌మెన్‌కు మినహాయింపు ఉంటుంది.)
- ఆన్‌లైన్‌లో పార్ట్-1 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మే 28, 2015.
- ఆన్‌లైన్‌లో పార్ట్-2 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్ 1, 2015.
- రాత పరీక్ష తేదీలు: ఆగస్టు 9, 2015, ఆగస్టు 16, 2015.