విద్యార్థుల ఇళ్లలో టీవీలు, స్మార్ట్ ఫోన్లు పెరిగాయ్..!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఇళ్లలో టీవీలు, స్మార్ట్ ఫోన్లు, మోటారు వాహనాల వినియోగం పెరిగినట్లు విద్యారంగం-2020 వార్షిక నివేదిక పేర్కొంది.
2020లో 92.9 పిల్లల ఇళ్లలో టీవీలు ఉన్నట్టు తెలిపింది. ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు, మోటారు వాహనాలు ఎంతమేరకు ఉన్నాయనే దానిపై 2020 వార్షిక నివేదికలో రాష్ట్రాల వారీగా వివరాలను తెలిపింది. 2018లో ఏపీలోని ప్రభుత్వ బడుల్లో చదివే 89.4 % పిల్లల ఇళ్లలో టీవీలు ఉండగా.. 2020లో అది 92.9 % పెరిగింది. స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే.. సర్కారీ స్కూళ్లలో చదువుతున్న 35.2 శాతం పిల్లల ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు ఉండేవి. 2020లో అది 57 శాతానికి పెరిగింది. అంటే విద్యార్థుల ఇళ్లల్లో 21.8 శాతం మేర స్మార్ట్ ఫోన్లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. అలాగే 2018లో ప్రభుత్వ స్కూళ్లలో చదివే 45.7 శాతం పిల్లల ఇళ్లలో మోటారు వాహనాలుంటే.. 2020లో అది 49.1 శాతం పెరిగింది. అంటే 2018తో పోల్చితే 2020లో మోటారు వాహనాలు గల ఇళ్ల శాతం 3.4 శాతం మేర పెరిగింది.
Published date : 08 Feb 2021 02:30PM