Skip to main content

ఆ ఉద్యోగాల గురించే నెట్టింట్లో తెగ సెర్చింగ్..

సాక్షి, ఎడ్యుకేషన్: కొవిడ్ కారణంగా తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని చాలా సంస్థలు.. వర్క్ ఫ్రమ్ హోం (ఇంటి నుంచే పని) వెసులుబాటు ఇచ్చాయి. అనేక రంగాల్లో ఉద్యోగాల్లో క్షీణత కనిపించినా.. టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికి ఆ ప్రభావం కొంత మేర తక్కువగానే ఉంది.

గత కొన్ని నెలలుగా ఇంటి నుంచి పనిచేస్తున్న (రిమోట్ వర్కింగ్) వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఓ తాజా నివేదిక పేర్కొంది. అలాగే కొవిడ్-19 ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుతం వర్క్ ఫ్రమ్‌హోం ఉద్యోగ నియామకాలు మూడు రేట్లు పెరిగినట్లు వెల్లడించింది. గత కొన్నేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోంచేసే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరం గణనీయంగా వృద్ధి రేటును నమోదు చేసిందని తెలిపింది. అంతేకాకుండా వర్‌‌క ఫ్రమ్ హోం ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 7 రేట్లు పెరిగినట్లు సదరు సర్వే పేర్కొంది. ఇది కొవిడ్-19 కంటే ముందుతో పోలిస్తే 3శాతం ఎక్కువని వెల్లడించింది.

రిమోట్ వర్కింగ్.. కొలువులపై ఆసక్తి
గత ఐదు నెలలుగా రిమోట్ వర్కింగ్ (ఎక్కడి నుంచైనా పనిచేసే) ఉద్యోగాల గురించే ప్రధానంగా తమ సెర్చ్ ఇంజన్ లో వెతికినట్లు నౌకరీ డాట్ కామ్ సర్వే పేర్కొంది. అలాగే 2019తో పోలిస్తే 2020లో వర్క్ ఫ్రమ్ హోం జాబ్ సెర్చింగ్ నాలుగు రేట్లు పెరిగినట్లు తెలిపింది. మహమ్మారి కారణంగా క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సి సంప్రదాయ ఉద్యోగాలైన సేల్స్/బిజినెస్ డెవలప్‌మెంట్/కస్టమర్‌కేర్ సిబ్బంది కూడా వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ద్వారా ఇంటి నుంచే కార్యాకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

సౌలభ్యత వైపు మొగ్గు
ఉద్యోగులు ఎక్కువగా ఇంటి నుంచి పనిచేయడం ద్వారా వ్యక్తిగతమైన, వృత్తిపరమైన జీవితాల్లో ఎంతో సౌలభ్యాన్ని పొందడమే రిమోట్ వర్కింగ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా సదరు సర్వే పేర్కొంది. అంతేకాకుండా రిమోట్‌వర్కింగ్ వల్ల సమయం, డబ్బు ఆదా అవుతోందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది. అందుకే రిమోట్ వర్క్‌కు ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది.

బీపీఓ/ఐటీఈఎస్‌లోనే ఎక్కువ

  • ఆన్‌లైన్ వేదికగా రిమోట్ జాబ్స్ చేసే వారిలో ఎక్కువగా బీపీఓ/ఐటీఈఎస్ రంగ ఉద్యోగులు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఈ-కామర్స్/ఆన్‌లైన్ ఎడ్యుకేషన్/టీచింగ్ అండ్ ఇంటర్నెట్ సిబ్బంది ఉంటున్నారు.
  • బీపీఓ/ఐటీఈఎస్ ఉద్యోగాలు వృద్ధిలో ఉండగా.. ఈ-కా మర్స్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, టీచింగ్, పబ్లిషింగ్, బీఎఫ్ ఎస్‌ఐ వంటి రంగాల్లో కొలువులపై కొంతమేర ప్రభావం ఉన్నట్లు పేర్కొంది. అలాగే ట్రావెల్ అండ్ స్టాఫింగ్ వంటి రంగాల్లో రిమోట్ వర్కింగ్ అవకాశాలు
Published date : 21 Nov 2020 04:35PM

Photo Stories