స్టార్టప్ వర్క్ చేసే విద్యార్థులకు 18–20 క్రెడిట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: స్టూడెంట్ స్టార్టప్ పాలసీని 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేసేందుకు హైదరాబాద్ జేఎన్‌టీయూ చర్యలు చేపట్టింది.
స్టార్టప్‌ల కోసం పనిచేసే విద్యార్థులకు 18–20 క్రెడిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. విద్యార్థులు ఆన్‌లైన్ కోర్సులు చదివే అవకాశాన్ని కల్పించింది. కాలేజీ, యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు మినీ, మేజర్ ప్రాజెక్టులను చేపట్టవచ్చని పేర్కొంది. ఇందుకోసం విద్యార్థులు కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. అలాగే అటానమస్ కాలేజీలు, ఎన్‌బీఏ గుర్తింపు కలిగిన కోర్సులు ఉండి, న్యాక్ గ్రేడ్ కలిగిన కాలేజీలతో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ మంజూరు హుస్సేన్ తెలిపారు.
Published date : 12 Jun 2021 02:04PM