సైబర్ అంబాసిడర్లుగా ఎంపికైన విద్యార్థులకు శిక్షణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ ద్వారా జరిగే సైబర్ నేరాలను విద్యార్థులు పసిగట్టాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు విమెన్సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో సైబర్ కాంగ్రెస్ అనే కార్యక్రమం చేపట్టారు. దీనికోసం ప్రతీ జిల్లా నుంచి కొందరు విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా ఎంపిక చేసి శిక్షణ అందిస్తున్నారు. వారిని ఉద్దేశించి డీజీపీ మహేందర్రెడ్డి వీడియో సందేశం పంపారు. టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్న నేరాలను గుర్తిస్తూ, స్నేహితులను, ఇరుగుపొరుగు వారిని చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత ప్రతీ విద్యార్థిపై ఉందన్నారు. విద్యార్థులు అవగాహన పెంచుకుని ఉత్తమ సైబర్ అంబాసిడర్లుగా మారాలని ఆకాంక్షించారు. విమెన్సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతిలక్రా, డీఐజీ సుమతి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రస్తుతం శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి.
ఛోటా భీమ్, చుట్కీతో ప్రచారం
చిన్నపిల్లల్లో సైబర్ నేరాలపై అవగాహనను పెంచేలా రూపొందించిన ఈ కార్యక్రమానికి చోటాభీమ్, చుట్కీ, డోలూ బోలూ, జగ్గూ తదితర సీరియల్ పాత్రలతో ప్రచారం కల్పిస్తున్నారు. తెలంగాణ యాసలో సైబర్ కాంగ్రెస్ ఉద్దేశాలు, లక్ష్యాలను వాటితో చక్కగా వివరించారు. విద్యార్థులతో కలిసి ఈ పాత్రలు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Published date : 23 Jun 2021 02:22PM