పరిశోధనలకు నిధులు అవసరం: ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ బీఎస్ మూర్తి
Sakshi Education
సంగారెడ్డి టౌన్: ప్రస్తుతం తమ సంస్థలో పరిశోధనలకోసం ఏడాదికి రూ.50 కోట్లమేర నిధులు సమకూరుతున్నాయని, 2024 నాటికి వివిధ మార్గాల్లో ఈ నిధులను రూ.200 కోట్ల వరకు పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి స్పష్టం చేశారు.
జనవరి 30 (గురువారం)న ఆయన మాట్లాడుతూ.. 2024 నాటికి ఐఐటీ హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ పార్క్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో 40 కంపెనీలు, 50 స్టార్టప్‌లను ఏర్పాటు చేయడానికి కసరుత్తు చేస్తున్నట్లు వివరించారు. ఐఐటీ హైదరాబాద్ పేరు దేశ, విదేశాల్లో మారుమోగేలా కృషి చేస్తామని చెప్పారు.
Published date : 31 Jan 2020 02:52PM