నూతన పద్ధతిలో ఆన్‌లైన్ తరగతులు: వరంగల్ నిట్
Sakshi Education
కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నిట్ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు తరగతి గది అనుభూతి కల్పించేలా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు ఎల్‌ఎంఎస్ (లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) నూతన సాఫ్ట్‌వేర్ రూపొందించారు.
![](/sites/default/files/images/2020/06/06/NIT_Warangal.jpg)
ఈ విధానాన్ని సెప్టెంబర్ నుంచి అమలు చేయనున్నారు. విద్యార్థులు ఇంట్లో లేదా.. హాస్టల్ గది నుంచి ఎల్‌ఎంఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా టీచింగ్ పొందే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి యాప్, వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చారు. నిట్ వరంగల్ ఈసీఈ విభాగం సౌజన్యంతో నిట్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, డీన్, ప్రొఫెసర్ బంగారుబాబు, ఈసీఈ ప్రొఫెసర్ కె.రవికిషోర్ సంయుక్తంగా రూపొందించిన ఎల్‌ఎంఎస్‌ను సాఫ్ట్‌వేర్‌ను నిట్ డెరైక్టర్ ఎన్వీ.రమణారావు ఆన్‌లైన్‌లో ఆవిష్కరించి అభినందించారు.
Published date : 06 Jun 2020 02:42PM