Teachers Transfer: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు..
ఆదిలాబాద్‌టౌన్: ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు వెంటనే చేపట్టాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జీ. సదానందం గౌడ్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖకు గతం కంటే ఎక్కువ నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటించేలా తమ సంఘం ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. మండలానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
TSWREIS Admission Notification: గురుకులాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
దీంతో పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు, సంపన్న వర్గాల్లోని పేదలకు నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత, పర్యవేక్షణ అధికారుల కొరత ఉందని, ఒక ఎంఈవోకు నాలుగైదు మండలాల బాధ్యతలు అప్పగించడంతో సరైన రీతిలో పర్యవేక్షణ చేపట్టడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెజ్జంకి రవీంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ అశోక్, పూర్వ జిల్లా అధ్యక్షుడు చిలుక విలాస్ తదితరులు పాల్గొన్నారు.