Tenth Examination Fees: టెన్త్ పరీక్ష ఫీజులు చెల్లించాలి
Sakshi Education
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత ఏప్రిల్‌లో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులు వచ్చే మార్చిలో జరిగే పరీక్షలకు హాజరుకావడానికి పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యామ్ సుందర్ ఓ ప్రకటనలో తెలిపారు. మూడు సబ్జెక్టుల వరకూ రూ. 110 చొప్పున, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 పరీక్ష రుసుం చెల్లించాలని, ఈనెల 5వ తేదీ వరకూ గడువు ఉందని పేర్కొన్నారు. అనుత్తీర్ణులై తిరిగి పాఠశాలలో ప్రవేశం పొందని విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుందని తె లిపారు. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల లాగిన్ లోని పేమెంట్ గేట్‌వే ద్వారా మాత్రమే ఫీజులు చెల్లించాలని డీఈఓ సూచించారు.
Published date : 01 Sep 2023 03:42PM