Talent Competitions: విద్యార్థులకు ప్రతిభా పరీక్షల నిర్వాహణ..
సాక్షి ఎడ్యకేషన్: పేద విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు నిర్వహిస్తున్న ఉపకార వేతనాల పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ సూచించారు. ఈనెల 15న పదో తరగతి విద్యార్థులకు నిర్వహించనున్న ఉపకార వేతనాల పరీక్ష వాల్‌పోస్టర్‌ను రామకృష్ణాపురంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు.
University Professor: రెకార్డు సాధించిన ప్రొఫెసర్‌కు వర్సిటీ అధికారుల అభినందనలు..!
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోగొట్టడంతో పాటుగా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఉపకారవేతనాల పరీక్షలు ఉపయోగపడుతాయన్నారు. ఏపీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ఎంట్రన్స్‌లో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు, మెమొంటోలు అందిస్తారన్నారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు మార్క్, రత్నరాజు, కరుణాకర్, కృష్ణ పాల్గొన్నారు.