Study for Students: విద్యార్థులకు సచివాలయ సేవల అధ్యయనం
Sakshi Education
పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థలకు సాంఘిక శాస్త్రంలోని సచివాలయ వ్యవస్థ గురించి వివరించేందుకు వారిని గ్రామ సచివాలయానికి తీసుకెళ్లారు. అక్కడ వాటి గురించి వివరించారు..
![Sixth class students visited Mandara Secretariat Social Science Education](/sites/default/files/images/2024/02/24/village-secretariat-visit-students-1708762248.jpg)
సంతకవిటి: మండలంలోని మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థులు గురువారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు గడే అప్పలనాయుడు ఆధ్వర్యంలో గ్రామంలోని సచివాలయాన్ని సందర్శించారు.
Group-2 Exam: రేపు జరిగే గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు సిద్ధం..
సాంఘిక శాస్త్రంలోని సచివాలయ వ్యవస్థ పాఠ్యాంశంలో భాగంగా సచివాలయ సేవలను అధ్యయనం చేశారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సేవలు, సంక్షేమ పథకాల అమలు తీరు, ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను సిబ్బంది వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం వి.రవిశంఖర్ పాల్గొన్నారు.
Published date : 24 Feb 2024 01:40PM